సూర్యాపేట జిల్లా:-
విషజ్వరాలు ప్రబలుతున్న నేపధ్యంలో రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖామంత్రి శ్రీ ఈటల రాజేందర్ మంగళవారం ఉదయం సూర్యపేట జిల్లాకేంద్రంలోని ఏరియా ఆసుపత్రి లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.
అనంతరం ఆయన కొత్తగా ఏర్పాటు చేసిన మెడికల్ కళాశాల మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు,గుంటకండ్ల జగదీష్ రెడ్డి లతో కలసి సమీక్షాసమావేశం నిర్వహించారు.
మంత్రి ఈటల కామెంట్స్..
👉విష జ్వరాల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తంగా ఉంది.
👉వైద్యసిబ్బందికి నెల రోజులపాటు సెలవులు రద్దు.
👉విషజ్వరాలబారిన పడిన వారికి మెరుగైన వైద్యం.
👉విరోచనాల విరుగుడుకు గాను రోటా వ్యాక్సిన్ ను చిన్నారులకు అంద జేశారు.
👉వారికి ధైర్యం కల్పించాల్సిన బాధ్యత సిబ్బంది పై ఉంది.
👉ఇదే విషయమై సోమవారం రోజున పురపాలక శాఖామంత్రి కేటీఆర్ పంచాయతీ రాజ్ శాఖామంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావులతో సమీక్షా సమావేశం నిర్వహించాము.