1098 ఆపరేషన్ స్మైల్ పోస్టర్లు విడుదల

సూర్యాపేట డిసెంబర్31 చాటింపు ప్రతినిధి :


బాల కార్మికులను రెస్క్యూ చేసి... పిల్లల రక్షణ సంరక్షణ చర్యలు తీసుకునేందుకు ఈ జనవరి నెలలో జరగనున్న ఆపరేషన్ స్మైల్ ఆరవ విడత కార్యక్రమం కోెఆర్డినేషన్ సమావేశం మంగళవారం సూర్యాపేట జిల్లా పోలీసు ఎస్పీ కార్యాలయంలో జరిగింది. జిల్లా పోలీసు సూరెండెంట్ భాస్కరన్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఏయస్పీ  డీయస్పీ సీఐలు  యస్. ఐ లు ఇతర పోలీసు అధికారులు ఛైల్డ్ ప్రొటక్షన్ యూనిట్ ఆఫీసర్ లు లేబర్ డిపార్టుమెంటు ఎడ్యుకేషన్ డిపార్టుమెంటు.. 1098 ఛైల్డ్ లైన్ ప్రతినిధులు  ఉమ్మడి నల్గొండ జిల్లా చైల్డ్ వెల్ఫేర్ కమిటీ జుడీషియల్ బోర్డు మెంబర్స్ యాతాకుల సునీల్ బొల్లెద్దు వెంకటరత్నం తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఛైల్డ్ లైన్ 1098 ఆపరేషన్ స్మైల్ పోస్టర్లు విడుదల చేశారు.