భద్రాద్రి కొత్తగూడెం డిసెంబర్ 30 చాటింపు ప్రతినిధి : రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ మానస పుత్రిక అయిన సీతారామ ప్రాజెక్టును రాష్ట్ర రవాణా శాఖ మంత్రి శ్రీ పువ్వాడ అజయ్ కుమార్ సోమవారం సందర్శించారు. ఈ ప్రాజెక్ట్ పూర్తి అయితే ఉమ్మడి ఖమ్మం జిల్లా సస్యశ్యామలం అవుతుందన్నారు. వ్యవసాయానికి చివరి ఎకరా వరకు సాగునీరు అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతున్నామని తెలిపారు. నిర్మాణ పనుల వివరాలను సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం పంప్ హౌస్ల పనులు పరిశీలించారు. మంత్రి వెంట ప్రభుత్వ విప్ రేగా కాంతారావు , ఎంపీ శ్రీమతి మాలోతు కవిత , జడ్పీ చైర్మన్ కోరం కనకయ్య , ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ , గ్రంధాలయ సంస్థ చైర్మన్ దిండిగల రాజేందర్ , మాజీ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు ఉన్నారు.