టైటిల్ ప్రదానం చేస్తున్న ప్రముఖ సంగీత దర్శకుడు చైతన్ భరద్వాజ్
హైదరాబాద్, సెప్టెంబర్ 2, 2019: భారతదేశంలోని అగ్రశ్రేణి రేడియో నెట్‌వర్క్ 'రేడియో సిటీ' తుది దశకు చేరుకున్నది. ఈ ఏడాది రేడియో సిటీ సూపర్ సింగర్ విజేతగా సుస్వర తరంగ్ నిలిచారు. భారతదేశంలోనే ప్రతిభావంతులైన నేపథ్య గాయకుల అన్వేషణకు ప్రారంభించిన '11వ సుజుకి గిక్సర్ రేడియో సిటీ సూపర్ సింగర్' గ్రాండ్ ఫైనల్స్ ముగిసింది. హైదరాబాద్ నగరంలోని గచ్చిబౌలిలోని శరత్ సిటీలో సినీ, వాణిజ్య సంస్థలకు చెందిన ప్రముఖుల తళుకుబెళుకుల మధ్య గ్రాండ్ ఫినాలే సాగింది.
11వ ఎడిషన్ గిక్సర్ రేడియో సిటీ సూపర్ సిటీ సింగర్ పోటీ నాలుగు వారాలుగా ఉత్తమ స్వరం గల గాయకుల కోసం జరిగిన పోటీలో ప్రతిస్పందన లభించింది. ఉత్తమ గాయకుడి కోసం ఆరుగురు గాయకులు గ్రాండ్ ఫినాలే కోసం పోటీ పడ్డారు. ప్రత్యుష పల్లపోతుల, నిఖితారావు, మౌన్య అర్ముల్లా, శ్రావణ్ గొడుగు, సుస్వర తరంగ్, శ్రీవాత్సవ అమరావది, పోటీలో ఉన్నారు.
పేరొందిన టాలీవుడ్ సంగీత దర్శకుడు చైతన్ భరద్వాజ్ రేడియో సిటీ సూపర్ సింగర్ విజేత సుస్వర తరంగ్‌కు అవార్డు ప్రదానం చేశారు. రూ.50 వేల నగదు బహుమతిని అందజేశారు. అవార్డుల ప్రదానోత్సవంలో బాహుబలి ఫేమ్ అడవి శేష్ తదితరులు పాల్గొన్నారు. జూనియర్ గాయకులు మనస్సులను కదిలించే ఈ ప్రదర్శనతో అటు శ్రోతలను, ఇటు న్యాయ నిర్ణేతలను మైమరిపింపజేసింది.
వరుసగా 11 వసంతాలుగా విజయవంతంగా సాగుతున్న రేడియో సిటీ సూపర్ సింగర్ పోటీ ప్రజాదరణతో విజయవంతమైంది. ఈ పోటీల్లో పాల్గొనడంతో చలన చిత్ర పరిశ్రమకు పరిచయమైన వారిలో హర్జోత్ కౌర్, మన్యా నారంగ్, శ్రీ గణే్ తదితర ఉత్తమ గాయకులు ఉన్నారు. దేశ వ్యాప్తంగా 6.9 కోట్ల మందికి పైగా శ్రోతల ఆధ్వర్యంలో ప్రతిభావంతులైన గాయకుల కోసం అన్వేషణ సాగింది. రేడియో సిటీ స్టూడియోస్, నగరాల్లోని మాల్స్, ఐవీఆర్ఎస్, సోషల్ మీడియా వేదికలు, రేడియో సిటీ బ్రాండ్ వాహనాల ఆధ్వర్యంలో శ్రోతల నుంచి నామినేషన్లను ఆహ్వానించడం జరిగింది.
రేడియో సిటీ చీఫ్ క్రియేటివ్ ఆఫీసర్ కార్తిక్ కల్లా ఈ సందర్భంగా మాట్లాడుతూ '11వ ఎడిషన్ రేడియో సిటీ సూపర్ సింగర్ పోటీ విజయవంతంగా పూర్తి కావడం సంతోషంగా ఉంది. ప్రతిభావంతులైన గాయకులకు వేదిక హైదరాబాద్ నగరం. అవకాశాల కోసం ఎదురు చూస్తున్న వారంతా తమ ప్రతిభా పాటవాలను రుజువు చేసుకునే వేదిక రేడియో సిటీ సూపర్ సింగర్స్ పోటీ. గత 11 ఏళ్లుగా భారతదేశంలోని ప్రతి గాయకుడికి తన ప్రతిభా పాటవాలను ప్రదర్శించేందుకు వేదిక కల్పించింది. వారి కలలు, ఆకాంక్షలు నిజమయ్యేలా చేసింది. ఈ ఏడాది ఫైనల్స్‌కు చేరుకున్న వారికి, విజేతలకు అభినందనలు తెలుపుతున్నా. వారి కలలు సాకారం చేసుకున్నందుకు అభినందిస్తున్నా. ఏడాదికేడాది రేడియో సిటీ సూపర్ సింగర్ పోటీ గాయకులు అత్యున్నత కీర్తి ప్రతిష్ఠలు పొందేందుకు తన ప్రయాణాన్ని కొనసాగిస్తుంది' అని చెప్పారు.
ఇటీవలే విడుదలైన బ్లాక్ బస్టర్ థ్రిల్లర్ 'ఎవరు' విజయవంతంగా మూడోవారాన్ని పూర్తి చేసుకుంటున్న సంబురాన్ని అడవిశేష్ సొంతం చేసుకుంటున్నారు. ఇందులో నటించిన రెజీనా చాస్సంద్రా ఈ సందర్భంగా మాట్లాడుతూ '11వ సీజన్ రేడియోసిటీ సూపర్ సింగర్' గ్రాండ్ ఫినాలేలో పాల్గొనడం గౌరవంగా భావిస్తున్నాను. కఠినమైన పోటీలో మధురమైన గాయాలతో పోటీ పడిన అభ్యర్థులందరికీ దీవెనలు, ఆశీస్సులు అందజేస్తున్నా. ఈ పోటీలో విజేత, పోటీ పడిన అభ్యర్థులందరికి ఉజ్వల భవిష్యత్ రావాలని కోరుకుంటున్నా' అని చెప్పారు.
తొలిసారి వెంకట్ రామ్‌జీ దర్శకత్వం వహించిన సీట్ క్రైమ్ థ్రిల్లర్ బ్లాక్ బస్టర్ సినిమా 'ఎవరు' తన అభిమానుల నుంచి, విమర్శకుల నుంచి పలు రకాల సమీక్షలను అందుకున్నది. పీవీపీ సినిమా నిర్మించిన ఈ సినిమాకు శ్రీచరణ్ పాకాల నేపథ్య సంగీతం అందించారు. అత్యంత కళాత్మకంగా రూపొందించిన కష్టం, గూడచారి, ఎవరు తదితర సినిమాలు అందించిన అడవి శేష్ 2020లో 'మేజర్' చిత్రాన్ని విడుదల చేయనున్నారు. 'మేజర్' సినిమా ఫస్ట్ లుక్ కోసం ఎదురుచూస్తున్న అడవి శేష్ దాని విషయమై నోరు విప్పడం లేదు.
ఏళ్ల తరబడి సంగీత పరిశ్రమ దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి అసాధారణ ప్రతిభావంతులైన గాయకులను అందుకున్నది. రాగ్ రాగ్ మైన్ డౌడ్ సిటీ అనే తత్వంతో సాగుతున్న రేడియో సిటీ సూపర్ సింగర్ పోటీ రేడియో సిటీ శక్తి సామర్థ్యాలకు నిజమైన ఉదాహరణగా నిలుస్తుంది. అలాగే స్థానికంగా, భాషాపరంగా తమ కలలను సాకారం చేసుకోవాలని భావిస్తున్న జూనియర్ గాయకులతో భావోద్వేగ పూరిత అనుబంధాన్ని పెనవేసుకున్నది రేడియో సిటీ.
రేడియో సిటీ 91.1ఎఫ్ఎం గురించి:
జాగరణ్ ప్రకాశన్ లిమిటెడ్ అనుబంధ మ్యూజిక్ బ్రాడ్‌కాస్ట్ లిమిటెడ్ (ఎంబీఎల్) నిర్వహిస్తున్నసంస్థ భారతదేశంలోని తొలి ఎఫ్ఎం రేడియో 'రేడియో సిటీ' నిలిచింది. ఎఫ్ఎం రేడియో పరిశ్రమలో 17 సంవత్సరాలకు పైగా నిరంతరం అగ్రశ్రేణి సంస్థగా 'రేడియో సిటీ' పేర్కొంది. సగటున బెంగళూరులో 24.5 శాతం, ముంబైలో 15.7 శాతం మంది శ్రోతలు ఉన్నారు. మ్యూజిక్ బ్రాడ్ కాస్ట్ లిమిటెడ్ సంస్థ 12 రాష్ట్రాల్లో 39 స్టేషన్లలో ఎఫ్ఎం జనాభా 62 శాతం ఉంటుంది. ఎజడ్ రీసెర్చ్ 2019 ప్రకారం దేశంలోని 34 నగరాల పరిధిలో 6.9 కోట్ల మందికి పైగా శ్రోతలను తన ఖాతాలో చేర్చుకున్నది. నెట్‌వర్క్ పరిధిలో 18 ఇతర వెబ్‌స్టేషన్లలో www.radiocity.inలో డిజిటల్ ఇంటర్‌ఫేస్ కార్యక్రమాలు నిర్వహిస్తోంది.
ఎఫ్ఎం రేడియో ఆధ్వర్యంలో రేడియో సిటీ విస్తరించింది. 'రాగ్ రాగ్ మైన్ డౌడ్ సిటీ' తత్వంతో శ్రోతలను పెంచుకున్నది. 'బాబర్ షేర్', లవ్ గురు' కాన్సెప్ట్‌తో హాస్యరసంగా నెట్‌వర్క్ ప్రారంభమైంది. రేడియో సిటీ ఫ్రీడం అవార్డ్స్‌ను స్వతంత్ర మ్యూజిక్‌తో జూనియర్ గాయకుల అన్వేషణ కోసం రేడియో సిటీ సూపర్ సింగర్ పోటీ ప్రారంభించింది.
రేడియో సిటీ జాతీయంగా అంతర్జాతీయంగా 73 అవార్డులను గెలుచుకున్నది. 2018-19లో గోల్డెన్ మైక్స్, భారత్ రేడియో వేదిక, న్యూయార్క్ అవార్డ్స్ తదితర పురస్కారాలను గెలుచుకున్నది. 'గ్రేట్ ప్లేస్ టు వర్క్ ఇన్స్టిట్యూట్' రూపొందించిన భారతదేశంలోని ఉత్తమ సంస్థల జాబితాలో ఏడోసారి రేడియో సిటీ పేరు నమోదు చేసుకున్నది.
పూర్తి వివరాల కోసం www.radiocity.inలో లాగ్ ఆన్ కండి.