నల్లగొండ జిల్లా :
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ' 30 రోజుల ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక' 
అమలులో భాగంగా నల్గొండ జిల్లా ఉరుమడ్ల గ్రామంలో జరిగిన కార్యక్రమంలో పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు గారు, విద్యుత్ శాఖ మంత్రి జి.జగదీష్ రెడ్డి గారు, జెడ్పీ చైర్ చైర్మన్లు బండ నరేందర్ రెడ్డి, ఏ.సందీప్ రెడ్డి, ఎంపీ లింగయ్య యాదవ్, ఎమ్మెల్సీ గుత్తా సుఖేందర్ రెడ్డి, ఎమ్మెల్యేలు చిరుమర్తి లింగయ్య, కె.భూపాల్ రెడ్డి, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి కమిషనర్ రఘునందన్ రావు, కలెక్టర్ గౌరవ్ ఉప్పల్, నార్మాక్స్ చైర్మన్ జితేందర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కామెంట్స్ :
సీఎం కేసీఆర్ గారు సంక్షేమం, అభివృద్ధిని సవాలుగా తీసుకుని గత ఐదేళ్లలో ఎన్నో పథకాలు ప్రవేశ పెట్టారు
రైతు బంధు, మిషన్ భగీరథ, కాళేశ్వరం, ఆసర్, కేసీఆర్ కీట్ వంటి ఎన్నో పథకాలను అమలు చేస్తున్నారు
రెండోసారి అధికారంలోకి రాగానే గ్రామాల సమగ్ర అభివృద్ధి కోసం 30 రోజుల ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక ను రూపొందించారు.
మన ఊరిని మనమే బాగు చేసుకోవాలి. అందరం కలిసి ఊరిని బాగు చేసుకుందాం
ఊరి అభివృద్ధికి గ్రామంలో పుట్టిన ప్రతి ఒక్కరూ ఒకరోజు శ్రమదానం చేయాలని కోరుతున్నా
గ్రామ అభివృద్ధికి వార్షిక, ఐదేళ్ల ప్రణాళిక ఉండాలి. కరెంట్ లూజ్ లైన్లను వారంలో సరి చెయ్యాలి
గ్రామ అభవృద్ది కోసం ఐకమత్యంగా పని చెయ్యాలి
పాత బాయి బోందలను పూడ్చి వెయ్యాలి, మురుగు నీటి కాల్వలను శుభ్రం చేయాలి
ఉపాధి హామీ పథకం కింద అన్ని రకాల అభివృధి కార్యక్రమాలను చేపట్టవచ్చ
ఉరు మడ్ల గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా అభివృద్ధి అభివృద్ధి చేసుకుందాం
గ్రామంలో బహిరంగ ప్రదేశాల్లో వేసిన వారికి రూ.500, రెండోసారి వేస్తే వెయ్యి రూపాయలు జరిమానా వెయ్యాలని గ్రామ సభలో తీర్మానం
బహిరంగ మలసర్జన చేస్తే రూ.500 జరిమానా విధించాలని గ్రామ సభలో తీర్మానం
30 రోజుల గ్రామాల అభివృద్ధి ప్రణాళిక అమలులో భాగంగా సొంత ఊరు ఉరుమడ్లకు కోటి రూపాయలు విరాళం ప్రకటించిన టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు కంచర్ల కృష్ణారెడ్డి.
చెక్ రూపంలో మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, జగదీష్, సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి కి అంద జేసిన కంచర్ల కృష్ణారెడ్డి
కృష్ణారెడ్డి నల్గొండ శాసనసభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి సోదరుడు.