నేల మీద కుర్చీలో కూర్చోవటంలో ఇంకా కంఫర్ట్ కావాలంటే లగ్జరీని చేర్చుకోవచ్చు. కానీ ఆకాశంలో కుర్చీ వేసుకుని కూర్చుంటే ఎలా ఉంటుంది? ఆసలు ఆకాశంలో కుర్చీ వేసుకుని కూర్చోవడం ఎలా సాధ్యం అంటారా....అది పారాగ్లైడింగ్‌తో మాత్రమే సాధ్యం. విమానం ఎక్కినప్పుడు మనం ఆకాశంలో ప్రయాణిస్తున్న అనుభూతి మాత్రమే లభిస్తుంది. కానీ పక్షిలా ఎగిరిన ఫీలింగ్ మాత్రం ఉండదు. ఈ అనుభూతి సొంతమవ్వాలంటే పారాగ్లైడింగ్ మాత్రమే మార్గం. విభిన్న ఆలోచనలు..అభిరుచులు కలిగిన పర్యాటకులు ఇప్పుడు కేవలం పారాగ్లైడింగ్ అనుభూతి కోసం హిమాచల్ ప్రదేశ్‌లోని 'బిర్–బిల్లింగ్' ప్రాంతానికి క్యూ కడుతున్నారు. చలి వేళ సాహసాలకు దిగుతున్నారు.
బిర్ బిల్లింగ్.. చిల్ థ్రిల్లింగ్!