హైదరాబాద్: టీఎస్ఆర్టీసీ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఆర్టీసీ ఉద్యోగుల పదవీ విరమణ వయసును 58 నుంచి 65కి పెంచింది. ఈ మేరకు బుధవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ఈ ఉత్తర్వులు ఆర్టీసీలో పనిచేసే ప్రతి ఉద్యోగికి వర్తించనున్నాయి. 52 రోజుల సమ్మె అనంతరం ఆర్టీసీ కార్మికులతో చర్చల సందర్భంగా ఉద్యోగుల పదవీ విరమణ వయసును పెంచుతామని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఉద్యోగుల పదవీ విరమణ వయసును 58 నుంచి 65కి పెంచుతూ రూపొందించిన ఉత్తర్వులపై సీఎం కేసీఆర్ నేడు సంతకం చేశారు. ఉత్తర్వులపై ఆర్టీసీ ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు.
టీఎస్ఆర్టీసీ ఉద్యోగులకు శుభవార్త