మహిళల పట్ల మా దృక్పథం అంబేత్కర్ దృక్పథం!!!! మహాదీక్ష_ లో కృష్ణ మాదిగ

#మహాదీక్ష_రివ్యూ


అత్యాచార బాధిత కుటుంబాల సాక్షిగా
చట్టాల అమలులో కులాల పాత్రను  కృష్ణ మాదిగ ఇందిరా పార్కు మహాదీక్షలో బట్టబయలు చేశారు,
జె,బి,రాజు గారు అధ్యక్షత వహించగా వేదిక మీద అత్యాచార బాధితుల తల్లిదండ్రులు, బీసీ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్, కృష్ణయ్యా గారు, మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్ గారు, మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు జి, చెన్నయ్యగారు, దీపక్ మాల  గారు, బీసీ సంఘం దాసుసురేష్ యాదవ్ గారు,బెడ బుడగ జంగాల నాయకులు సిరి గిరి మన్యం గారు, ఎరుకల సంఘం కుమార్ గారు, ప్రో, గాలి వినోద్,
ఆల్ ఇండియా ఏంప్లాస్ ఫెడరేషన్, మహేష్ రాజ్, తుడుం దెబ్బ, వట్టం ఉపేందర్ గారు,
సింది హక్కుల పోరాట సమితి, గల్జీల్ గణపతి, మాదిగ మహిళల సమాఖ్య, జేపీ లత,msp, ఉస్మానియా విద్యార్థి నాయకులు శరత్ చామర్ , రుద్రవరం లింగాస్వామీ రంజిత్, గోవింద్ నరేష్, పురుషోత్తం, తో పాటు అన్ని కుల, ప్రజా సంఘాల నాయకులు పాల్గొని హత్యాచారం, వాటి శిక్షల అమలులో జరుగుతున్న కుల వివక్షను ఖండించారు,
అందరూ కూడా వీటి పరిష్కారం రాజ్యాధికారం అని చెప్పుకొచ్చారు, రాములు నాయక్ మాట్లాడిన అనంతరం చివరగా mrps అధినేత మాన్య శ్రీ మందా క్రిష్ణ మాదిగ గారిని  మాట్లాడవలసిందిగా కోరగా చేతి కర్ర సహాయంతో నిలబడి,తన ఉపన్యాసాన్ని ప్రారంభించి  రాష్టంలో పదుల సంఖ్యలో జరుగుతున్న అత్యాచారాల సంఘటనలో ప్రియాంక రెడ్డిది ఒక సంఘటన,అదే సంఘటనలో నిందితులను హతమార్చి, మిగితా సంఘటన లో ఎందుకు న్యాయం కల్పించలేక పోయారు అనే నేపద్యం సాగుతున్న దీక్షకు వచ్చిన వారికి నమస్కారాలతో మొదలు జరుతున్నపెట్టి పరిణామ  క్రమాలను, వివక్షను దాదాపు రెండుగంటల పాటు సవివరంగ వివరించడం జరిగింది,


మహిళల పట్ల మా దృక్పథం పులే దృక్పథం!!!
మహిళల పట్ల మా దృక్పథం అంబేత్కర్ దృక్పథం!!!!


పులే మహిళలకు విలువలు కావాలన్న, ప్రాతినిధ్యం కావాలన్న, గౌరవం దక్కాలి అన్న వారికి జ్ఞానం కావాలని వారి చదువు కోసం తాపత్రయ పడిన వ్యక్తి జ్యోతి రావ్ పులే, పులే కులం చూడలేదు మతం చూడలేదు అందరి మహిళల గురించి ఆలోచించారు,


రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ మహిళలకు హక్కులు కావాలి అని, అన్ని రంగాలలో ప్రాతినిధ్యం  వారికి దక్కాలి అని, హిందూ కోడ్ బిల్లు అందించి  మంత్రి పదవికి రాజీనామా చేశారు,


వారి స్ఫూర్తి కొనసాగిస్తూ  వారి అడుగుజాడల్లో నడుస్తున్న మేము మహిళల మీద జరుగుతున్న ఏ రకమైన వివక్ష అయిన ప్రశ్నిస్తూ వస్తున్నాం,,


మూడు ఏండ్ల క్రితం కొల్లాపూర్ తాలూకా కుడికిల్ల గ్రామంకు చెందిన ఒక కోమటి సామాజిక వర్గం మహిళలను కొందరు దుండగులు హత్యాచారం చేస్తే , అవమానం భరించలేక నిప్పు పెట్టుకొని చనిపోతే , అధికార పార్టీ నేత జూపూడి కృష్ణ రావు నిందితులను కాపాడే ప్రయత్నం చేస్తే MRPS బాధితుల పక్షాన నిలిచి న్యాయం చేయకపోతే  జిల్లాను దిగ్బంధం చేస్తాం అని పిలుపు ఇస్తే ప్రభుత్వం దిగివచ్చి వారి కుటుంబానికి ఇరవై ఐదు లక్షల ఎక్స్ గ్రేషియ ప్రకటించి నిందితులను జైలుకు పంపారు,,,
ఈ సంఘటన లో బాధిత మహిళా ఏ కులం అని mrps చూడలేదు,


ఈ దేశంలో పదిహేను ఎండ్లలో మూడు లక్షల నలపై ఒక మంది హత్యలు హత్యాచరలకు గురి అయినట్టు లెక్కలు ఉన్నాయి  మరి   ప్రియాంక రెడ్డి హత్యచారం ఒక అరుదైన సంఘటన నా????


మరి  ప్రియాంక రెడ్డి విషయం లో మాత్రమే ఎందుకు నిందితులను హెన్ కౌంటర్ చేసి చంపారు?????


నిందితులను కాల్చి చంపినవారు పోలీసులే కాని సూత్ర దారులు వేరు, పోలీసులు అప్పటి వరకు పూలు చల్లించుకోవచ్చు కాని
అది బూటకపు ఎన్కౌంటర్ త్రిసభ్య కమిటీ తెల్చితే శిక్షలు ఎదురుకోవల్సింది మాత్రం పోలీసు అధికారులు అని గనించాలి,
దేశంలో ఈ మధ్యకాలంలో అనేక అహ్యాచారాలు అత్యలు జరుగుతుంటే ఎక్కడ మాత్రమే ఎందుకు నిందితులను హెంకౌంటర్ చేయగలిగారు?
ఇక్కడే ఎందుకు మొదలు పెట్టారు,, ఇక్కడే ఎందుకు నిలిపి వేశారు..
దేశంలో ఇది మొదటి సంఘటన నా ,,??
చివరి సంఘటననా...??


మరి ఎందుకు ఇక్కడే మొదలు పెట్టారు,, 
ఎందుకు ఇక్కడే నిలిపివేశారు,
ఇది ఒక్కటే అరుదైన ఘటన నా అని అడుగుతున్నాం....
ఈ దేశంలో అరుదైన ఘటనలు మాత్రం నాలుగు ఉన్నాఈ, అవి దేశాన్ని, ప్రపంచాన్ని కుదేలు చేశావి,


1:ఒకటి స్వాతంత్ర అనంతరం  గాంధీని హత మార్చడం ,ఆ కేసులో నిందితుడైన గాడ్సే ను ఆధారాలు సేకరించి కోర్టులో ప్రవేశ పెట్టీ కోర్టు ఉరిశిక్ష   విదిస్తే  చట్టపరంగా శిక్షించారు,
2: దేశ ప్రధానిగా ఉన్న సమయంలో ఇందిరాగాంధి గారిని బియాన్ సింగ్, సత్యం సింగ్ అనే వారు చంపగా వారిని కోర్టుకు హాజరు పరిచి కోర్టు విధించిన శిక్షల అమలు చేశారు,
3: రాజీవ్ గాంధి గారిని LTD  త్రీవ్రవాద వర్గాలు  బాంబు పెట్టీ చంపితే రాజీవ్ గాంధీ వేయి ముక్కలు అయినారు ,, తీవ్రవాదులు అయిన నళిని మృగన్ ను కాల్చి చంపకుండా కోర్టుకు హాజరు పరిచి కోర్టు ఉరశిక్ష విధిస్తే,ఆ శిక్ష కూడా సోనియా గాంధీ మానవతా దృక్పథం తో క్షమాపణ బిక్ష పెడితే ఇప్పటి బ్రతికే ఉన్నారు,,,,
4: ముంబై తాజ్ హోటల్స్ లో ఉగ్రవాదుల కాల్పులలో పట్టుపడిన అజ్మల్ కసబ్ ను కూడా కోర్టులో హాజరు పరిచి, లాయరును విధించి, చట్టపరంగా ఉరిశిక్ష అమలు చేశారు,
  
ఇంతకంటే అరుదైన ఘటనా ప్రియాంక రెడ్డి విషయం??
ఇక్కడ స్పష్టంగా ఒకటి అర్థం అవుతున్నది, హెన్ కౌంటర్ చేసిన పోలీసులు పాత్ర దారులే!!!!! 
సూత్ర దారులు మాత్రం మూడు రకాలు!!
భారత రాజ్యాంగం ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించే
నాలుగు వ్యవస్థలను పేర్కొన్నారు, అవి


1,చట్టసభలు
2,కార్య నిర్వాహక వర్గం
3,న్యాయ వ్యవస్థ
4,మీడియా


ఇందులో మూడు వ్యవస్థలు ఈ హెన్ కౌంటర్ లో ప్రధానంగా పనిచేశావి,
1:న్యాయ వ్యవస్థ కళ్ళు గప్పి రాత్రి పూట జైలు నుండి బయటకు తీసుకువచ్చి సంఘట స్థలానికి తీసుకు వచ్చి చట్టాన్ని చేతిలోకి తీసుకొని కాల్చి చపడం,
2: మీడియా ప్రధాన దోషి హెంకౌటార్ కు కారణం ప్రత్యక్షంగా, పరోక్షంగా మీడియా పాత్ర ఉన్నది,
ప్రియాంకా రెడ్డి  సంఘటన నిందితులను, మృగాలుగా, నరరూప రాక్షసులుగా, అగ్రకుల మీడియా పత్రికా హెడ్ లైన్స్ లో రాసింది,
కొన్ని రోజుల వరకు అదే పనిగా,క్షణ క్షణం ఆ ఒక్క విషయాన్నే చూపించారు, వారి వర్గాల చేత ఆ నిందితులను ఉరితీయాలని, కాల్చి చంపాలి అని పలికించారు,
3: రెడ్డి సామాజిక వర్గం, ప్రియాంక రెడ్డి ఒక అగ్ర కుల ఆధిపత్య, రాజకీయ ఆర్థిక పలుకుబడి ఉన్న సామాజిక వర్గం, కాబట్టి పార్టీలకు అతీతంగా రెడ్డి సామాజిక వర్గం ఒక్కటి అయింది,
రాష్ట్రం లో ప్రధాన ప్రతిపక్షంగా ఉండబడే కాంగ్రెస్ పార్టీ PCC ప్రసిడెంట్ ఉత్తమ్ కుమార్ రెడ్డి , ప్రియాంక రెడ్డి ఇంటికి వెళ్ళినారు, 
PCC వర్కింగ్ ప్రసిడెంట్ రేవంత్ రెడ్డి ప్రియాంక రెడ్డి ఇంటికి వెళ్లినారు, 
మరొక ఎంపీ కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి ప్రియాంక రెడ్డి ఇంటికి వెళ్లి ఓదార్చారు
కేంద్ర  మంత్రి కిషన్ రెడ్డి  ప్రియాంక రెడ్డి ఇంటికి వెళ్లి ఓదార్చారు,,,, కాని ప్రియాంక రెడ్డి కంటే మూడు రోజుల ముందు ఆసిఫాబాద్ అడవుల లో టేకు లక్ష్మి అనే మహిళ మీద ముగ్గురు మృగాలు ఘోరంగా హత్యాచారం చేసి చంపితే ఈ కులతత్వ నాయకులకు కనపడలేదు,
ప్రియాంక రెడ్డి సంఘటన కంటే మూడు గంటల ముందు వరంగల్ జిల్లాలో మానసయాదవ్ అనే అమ్మాయి నీ హత్య చేసిన సంఘటన కులతత్వ రాజకీయ నాయకులకు కనపడలేదా??
ఎవ్వరైనా ఆడపిల్లే,, వారికి న్యాయం జరగాలి, నిందితులను పై చట్టపరంగా చర్యలు తీసుకోవాలి అని  అందరికంటే ముందుగా ప్రియాంక రెడ్డి ఇంటికి వెళ్ళాము, అక్కడి నుండి వరంగల్ లో మానస ఇంటికి వెళ్ళాను, అక్కడి నుంచి  ఆసిఫాబాద్  టేకు లక్ష్మి వద్దకు వెళ్ళాను,,
కులం తో మతం తో సంబంధం లేకుండా అందరినీ కలిసిన మహాజన నేత మందా క్రిష్ణ మాదిగ,
క్రిష్ణ మాదిగ మాట్లాడితే తప్పు  ఫస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు కాలేదు,
కృష్ణ మాదిగ మాట్లాడితే తప్ప వార్తలు బయటికి రాలేదు,
కృష్ణ మాదిగ మాట్లాడితే తప్పు ఎక్స్ గ్రేశియ రాలేదు


కృష్ణ మాదిగ మాట్లాడితే తప్ప ఉద్యోగం కల్పించలేదు,


ప్రశ్నిస్తే తప్ప న్యాయం జరగదా...
అడిగితే తప్ప ఈ గొరాలు కనిపించవా


మరి ప్రియాంక రెడ్డి విషయం లో మాత్రం రాష్ట్ర ప్రభుత్వం సత్వర స్పందిస్తుంది,
తెరాస మంత్రి KTR  స్పందించారు కాని బడుగు బలహీవర్గాల మీద జరిగిన హత్యాచారం కనిపించలేదు,
రెడ్డి సామాజిక వర్గ ప్రశంశలు పొందడానికి అధికారం లో ఉన్న వెలమ దొరల ప్రోత్ బలం మరింత తోడై ఈ మరణ కాండ సృష్టించారు,,, అనటానికి అందుకు సాక్ష్యంగా NHRC వేసిన ప్రశ్నలకు శాస్త్రీయమైన సమాధానాలు లేకపోవటమే!
బూటకపు ఎన్కౌంటర్ అనడానికి కొన్ని ప్రశ్నలు
1: మూడు బుల్లెట్లు దిగినా నిందితులు ఆయుధాలను వదిలి పెట్టలేదా?
2: పరిగెడుతుంటే కళ్ళమీద కల్చకిండ పై భాగాన ఎందుకు కాల్చారు??
3: ఇద్దరి వద్ద ఆయుధాలు ఉంటే నలుగురిని ఎందుకు కాల్చారు???


వీటికి సమాధానం లేదు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి  జగన్ మోహన్ రెడ్డి తెలగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ గారికి హెంకౌటర్ సమర్ధిస్తూ రాష్ట్ర అసంబ్లీలో హడ్సప్ చెప్పడం చూసే ఉంటం,, ఆ తరువాత రాష్ట్ర అసెంబ్లీలో దిశా చట్టాన్ని తీసుకు వచ్చారు, దిశా చట్టం రూపొందించిన గంటల వ్యవధిలోనే గుంటూరు జిల్లాలో ఒక మాల దళిత ఐదు ఏండ్ల బిడ్డ మీద లక్ష్మారెడ్డి అనే వేక్తి హత్యాచారం చేస్తే ఏం చర్యలు తీసుకున్నవారు,,
నెల్లూరు జిల్లాలో ఉదైగిరి కొండయపలెం లో అనూష అనే అమ్మాయిని వెంకట్ రెడ్డి అనే వెక్తీ వేదించి అహ్యాచరం,హత్యా చేసిన సంఘటన లో స్పందన లేదు, ప్రకాశం జిల్లాలో త్రిపురాంతకం లో  మానసిక వికలంగురాలు మీద , మరియు కర్నూల్ జిల్లా ప్రీతిబాయ్ అనే చిన్నారి మీద హత్యాచరాలకి పాల్పడిన వారు రెడ్డి సామాజిక వర్గం వరే కదా, మరి వీరికి ఎన్కౌంటర్ వర్తించదా????
రెడ్ల మీద  హత్యాచారం జరిగితే ఊగిపోయావే 
జగన్ మోహన్ రెడ్డి 
మాన ప్రాణాలు రెడ్లవెనా ,,,????
మావి మానాలు కావా?? ప్రాణాలు కావా??


హజిపూర్ అనే గ్రామం లో శ్రీనివాస్ రెడ్డి అనే ఒక్కడు  ముగ్గురి చిన్నారుల హత్యాచారం చేసి అత్యంత కిరాతకంగా చంపి బావిలో పుడిసి పెట్టాడు, కర్నూల్ లో మరో మహిళ ను చంపిన చరిత్ర ఉన్నది , 


ఒక్క రెడ్డి బాధితురాలి కోసం నలుగురి నిందితులను చంపితే 
నలుగురిని చంపిన శ్రీనివాస్ రెడ్డి నీ ఏం చేయాలో చెప్పాలి జగన్ మోహన్ రెడ్డి చెప్పాలి,
షాద్ నగర్ లో నవీన్ రెడ్డి అనే నిందితుడు శ్రీ హర్షిని అనే బాలికను చంపిన సమయనా ఈ శిక్షలు ఎందుకు అమలు చేయలేదు, వీరు బ్రతకడానికి అర్హులా అని అడుగుతున్నాం,,
అర్థం చేసుకోవాల్సిన విషయం ప్రియాంక రెడ్డి విషయంలో రెడ్డి సామాజిక వర్గం ప్రతీకారాన్ని కోరుకున్నది, ఫస్ట్ ట్రాక్ కోర్టులో కేసు వుండగానే  రహస్య ఎజెండా అమలు చేశారు, నలుగురి ప్రాణాలు తీశారు,
హెన్ కౌంటర్ తరువాత మా కూతురు ఆత్మకు శాంతి కలిగింది, మాకు ప్రశాంతత ఉంది అని ప్రియాంక తల్లి దండ్రులు అన్నారు,


మరి అదే తెలంగాణ రాష్టం లో అహ్యాచారాలకు గురి అయిన మహిళలకు ఆత్మ శాంతి వద్దా,, ?? వారి తల్లదండ్రులకు మన శాంతి వద్దా??
టేకు లక్ష్మి మహిళ కాదా???
మానస మహిళ కాదా??
రసజ్ఞ, మందారిక, శ్రావణి, కల్పన, మానిషా, ప్రియాంక, భూమిక, శ్రీ హర్శిని, జానకి , సంధ్యారాణి,
వీరు మహిళలు కాదా????
ఎస్సీ ఎస్టీ బీసీ మహిళలు బాధితులు ఐ  నిదితులు అగ్రవర్ణాల వారు అయితే  శిక్షలు ఉండవు,
బాధితులు అగ్రకులం వారు అయి నిందితులు అణగారిన వర్గాలు అయితే నిందితులకు సత్వర శిక్షలు అమలు జరుగుతుంది,


ఎస్సీ ఎస్టీ బీసీ మహిళలు బాధితులు అయినప్పుడు వారు ప్రతీకారాన్ని కోరుకోలేదు, న్యాయం జరిగితే చాలు అనుకున్నారు,
అగ్రకుల సమాజం మాత్రం ఎందుకు  ప్రతీకారం కోరుకున్నారు, ఏ విధంగా అనుకున్న లక్ష్యాన్ని నెరవేర్చుకున్నారు,
#అధికార 
ప్రతీకార హత్యలు ఎలా సాధ్యపడ్డవి??... 
#అధికారం
 దేనిని అడ్డు అడ్డు పెట్టుకొని ఈ బోయ, ముస్లిం బిడ్డల హెన్ కౌంటఅర్ చేయగలిగారు,,?????
#అధికారం,


ప్రియమైన నా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అన్నలారా!!తమ్ములారా!!అక్క లారా!! చెల్లెలారా 
సంఘటన ద్వారా మనకు కావల్సింది ఏంటో గమనించండి మన అక్కల అమ్మల చెళ్ళల మాన ప్రాణాలకు విలువలు లేనప్పుడు, మనం బ్రతికి ఉన్నది దేనికోసమో ఆలోచించండి,


రాబోయే రోజుల్లో రాజకీయ శక్తిగా మారకపోతే 
అధికార భలాలు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ప్రజలకు దక్కక పోతే మన మాన ప్రాణాలకు విలువలు లేవని గమనించాలి,, రోడ్ల మీద , అడవుల్లో జరిగే అహ్యాచారాలు ఇప్పుడు మన ఇంటికి వచ్చి చేసి పోతున్నారు అంటే ఆలోచించాల్సిన సందర్భం
అన్నింటికీ మాస్టర్ కి అధికారం అని తెలుసుకోవాలి


బూటకపు ఎన్కౌంటర్ కేసులో NHRC విధించిన త్రిసభ్య కమిటీని హైదరాబాద్లో  ఆరు నెలలు ఉండబోతుంది,,ఈ సమయం లోపు ఈ ఎన్కౌంటర్  ఒక బూటకం అని ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ  ఎన్కౌంటర్ సంఘటన సమర్దించటం లేదు అని తేల్చి చెప్పడానికి  నెల రోజుల తరువాత హైదరాబాద్ లో భారీ ప్రదర్శన చేయవలసి అవసరం ఎంతైనా ఉంది. దీక్ష తోనే మనం వెనక్కి తగ్గిన ఏం సాధించారు అనే నింద వస్తుంది ,, ఇక్కడితో ఆగకుండా దీనిని ప్రజా ఉద్యమంగా మార్చాల్సిన అవసరం ఉంది, అందుకోసం  ఒక కార్యాచరణ రాబోతుంది ఈ కార్యాచరపై ప్రజా కుల , విద్యార్థి ఉద్యోగ సంఘాల నాయకులు అమలు చేయటం లో పాలుపంచుకోవాలని , యూనివర్సిటీ లో విద్యార్థులను ఏకం చేయవల్సిన అవసరం ఉంది.


ఈ దిశగా ప్రయాణిస్తారు అని కోరుకుంటూ ...
సామాజిక ఉద్యమ వందనాలు