జనవరి 2 నుండి 12 వరకు రెండవ దశ పల్లె ప్రగతి:ఇంఛార్జి కలెక్టర్ వి.చంద్ర శేఖర్



నల్గొండ,డిసెంబర్ 27. చాటింపు ప్రతినిధి .ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పించేందుకు,విద్యార్థులకు తోడ్పాటు నందించెందుకు బ్యాంకర్ లు సహకారం అందించాలని ఇంఛార్జి కలెక్టర్ వి.చంద్ర శేఖర్ కోరారు.శుక్రవారం జిల్లా కలెక్టర్ కార్యాలయం లో లీడ్ జిల్లా మేనేజర్,జిల్లా పంచాయతీ అధికారి,బ్యాంకర్ లతో సమావేశం నిర్వహించి వివిధ అంశాలు చర్చించారు.ఈ సందర్భంగా ఇంఛార్జి కలెక్టర్ మాట్లాడుతూ జనవరి 2 నుండి 12 వరకు రెండవ దశ పల్లె ప్రగతి కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు,పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా బ్యాంకర్ లు పేద విద్యార్థులకు,పాఠశాలలకు ఉపయోగ పడేలా బ్యాంకులు తమ సర్వీస్ ఏరియా పరిధి లో ఉన్న పాఠశాల లకు  తమ దగ్గర వున్న కామన్ గుడ్ పండ్ నుండి నిధులు అంద చేయుటకు ముందుకు రావాలని అన్నారు.పాఠశాల విద్యార్థులకు పాఠశాలలకు ఉపయోగ పడేలా వారికి కావలసిన వస్తువులు తమ వంతుగా అందించ వచ్చని అన్నారు.విద్యార్థులు   బావి భారత పౌరులు గా భవిష్యత్తు లో దేశానికి సేవలు అందిస్తారని అన్నారు. జిల్లా విద్యశాఖాధికారి పాఠశాలల్లో కావలసిన అవసరాలు పై నివేదిక రూపొందించాలని అన్నారు.ఈ నెల 31 లోగా జాబితా రూపొందించాలని అన్నారు.పల్లె ప్రగతి లో బాగంగా అన్ని గ్రామ పంచాయితీ లలో ప్రభుత్వ ఆదేశాల ననుసరించి ట్రాక్టర్ లు కొనుగోలు చేయాలని,ఇందుకు బ్యాంకర్ లు గ్రామ పంచాయితీ వారీగా లోన్ అకౌంట్ తెరిచేందుకు బ్యాంకులు సహకరించాలని,లీడ్ మేనేజర్ అన్ని బ్యాంక్ బ్రాంచ్ లకు ఆదేశాలు జారీ చేయాలని సూచించారు.గ్రామ పంచాయతీ నుండి  ట్రాక్టర్ కొనుగోలు కు నిర్ణయించిన రేటు లో 35 శాతం మార్జిన్ మనీ అకౌంట్ లో జమ చేయగానే మిగతా 65 శాతం రుణం విడుదల చేయాలని లీడ్ మేనేజర్ ను కోరారు.ఈ సమావేశంలో జిల్లా విద్యశాఖాధికారి బిక్ష పతి, జిల్లా పంచాయతీ అధికారి విష్ణు వర్ధన్,లీడ్ జిల్లా మేనేజర్ సూర్యం తదితరులు పాల్గొన్నారు.