మేరు సంఘం నూతన సంవత్సర క్యాలెండర్ 2020 ఆవిష్కరణ

 హైదరాబాద్ డిసెంబర్ 29 చాటింపు ప్రతినిది:


మేరు సంఘం తెలంగాణ, మేడ్చల్ జిల్లా కార్యవర్గం ఆద్వర్యం లో ఈ రోజు హైద్రాబాద్ లోని బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో నూతన సంవత్సర క్యాలెండర్ 2020 ప్రారంభోత్సవ కార్యక్రమంను ఏర్పాటుచేశారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులు గా రాష్ట్ర ఎంబిసి కార్పొరేషన్ చైర్మన్ తాడూరి శ్రీనివాస్ ,  బీసీ కమిషన్ సభ్యులు వకులాభారణం కృష్ణ మోహన్ పాల్గొని క్యాలెండర్ ని ప్రారంభించారు. తదుపరి ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో బిసి కులాలకు ముఖ్యమంత్రి  పెద్దపీట వేశారు అని అన్నారు.  ఆత్మ గౌరవ భవనాలకు కావలసిన స్థలాలను కేటాయిస్తూ నే వాటి నిర్మాణానికి కోట్ల రూపాయలను విడుదల చేయడం పట్ల హర్షం వ్యక్తం చేశారు.  అంతే కాకుండా బిసి కులాలలో ఉన్న నిరుద్యోగ యువతకు చేయుతనందించేందుకు ప్రభుత్వం ఇప్పటికే అనేక నైపుణ్యశిక్షణ కార్యక్రమాలు చేపట్టి వారికి తోడ్పాటును అందించడం జరిగింది అన్నారు. ఇప్పటికీ మేరు కులస్తులు టైలరింగ్ వృత్తిని జీవనాధారంగా చేసుకొని జీవిస్తున్నారని కానీ ఈ కార్పొరేట్ ప్రపంచంలో వీరి కుల వృత్తి కుంటుపడిపోయినదని అన్నారు,  దీనికి కారణం గత ప్రభుత్వాలు వీరిని విస్మరించి వారికి తోడ్పాటును అందించకపోవడమే అని అన్నారు.  కానీ రోజు వారీ కార్యాచరణలో ఈ సమాజానికి  వృత్తి కులాల అవసరం ఎంతగానో ఉంటుందన్న ముందుచూపుతో మన రాష్ట్ర ప్రభుత్వం వీరి పట్ల ఎంతో సానుకూలంగా వ్యవహరించి వారి అభివృద్ధికి బాటలు వేసే కార్యక్రమాలు చేపడుతుందన్నారు. ప్రభుత్వ పాఠశాలలు, హాస్టల్ లు, ఆసుపత్రులకు అవసరమైన చోట మేరు కులస్తుల యొక్క సేవను వినియోగించుకోవాలని ఎంబిసి కార్పొరేషన్ ద్వారా ముఖ్యమంత్రి కి విన్నవిస్తానని తెలియజేశారు. ఈ కార్యక్రమానికి  మేరు సంఘం అధ్యక్షులు కీర్తి ప్రభాకర్, ట్రస్ట్ చైర్మన్ పొడిశెట్టి నర్సింగ రావు, సికింద్రాబాద్ గణేష్ టెంపల్ చైర్మన్ నగేష్ ముదిరాజ్, సంగెవార్, రామగిరి యాదగిరి తదితరులు పాల్గొన్నారు.