జనవరి 21న హైదరాబాద్ లో తపాలా పెన్షన్ అదాలత్

జనవరి 21న హైదరాబాద్ లో తపాలా పెన్షన్ అదాలత్


హైదరాబాద్,  డిసెంబర్ 27, 2019


          తపాలా పెన్షనర్స్ కి  సంబంధించి ప్రజల ఫిర్యాదులను, సమస్యలను తెలుసుకొనేందుకు 2019  జనవరి 21వ తేదీన మధ్యాహ్నం 02.30 గంటల కు హైదరాబాద్ లోని ఆబిడ్స్ లో గల  డాక్  సదన్ లో 'పెన్షన్ అదాలత్' ను నిర్వహించనున్నట్లు  అసిస్టె౦ట్ అకౌంట్స్ ఆఫీసర్ శ్రీ శివ కుమార్ ఓ ప్రకటనలో తెలిపారు. పోస్టల్ పెన్షనర్లు / కుటుంబ పెన్షనర్ల పెన్షన్, గ్రాట్యుటీకి సంబంధించిన ఫిర్యాదులను   తపాలా విభాగం లోని ద డైరెక్టర్ ఆఫ్ అకౌంట్స్ (తపాలా)డాక్ సదన్హైదరాబాద్- 500001,   చిరునామా కు కవర్ పైన  ''పోస్టల్ పెన్షన్ అదాలత్ ఆఫ్ తెలంగాణ సర్కిల్''  అనే పదాలు రాసి  తపాలా కవర్ లో 2020 జనవరి 10వ తేదీ లోపు తెలియ జేయవచ్చు. వ్యక్తిగత పెన్షనర్లు / కుటుంబ పెన్షనర్లు ప్రాంతీయ/డివిజనల్ స్థాయి పెన్షన్ అదాలత్ వద్ద తీసుకున్న కేసు యొక్క వాస్తవాలను సక్రమంగా అందించాలి మరియు ప్రాంతీయ/డివిజన్ స్థాయి ఇచ్చిన ఏదైనా ప్రత్యుత్తరం కాపీ ఉంటే, పెన్షన్ అదాలత్ కి సమర్పి౦చాలి. నిర్ణీత తేదీ తర్వాత అందుకున్న అభ్యర్థనలు పరిగణలోకి తీసుకొనబడవు. దరఖాస్తుదారులు కావాలనుకుంటే వ్యక్తిగతంగా అదాలత్‌కు హాజరుకావచ్చు.