పోలీసు వారి సూచనలు పాటిస్తూ సహకరించాలి.
*- DSP సూర్యాపేట సబ్ - డివిజన్.*
సూర్యాపేట డిసెంబర్ 31 చాటింపు ప్రతినిధి:
డిశంబర్ 31, నూతన సంవత్సర వేడుకలు జరుపుకునేవారు సంతోషంగా జరుపుకోవాలని, వేడుకల్లో విషాదం చేసుకోవద్దని, పోలీసు వారి సూచనలు పాటిస్తూ ప్రమాదాలకు దూరంగా ఉండాలని సూర్యాపేట సబ్-డివిజన్ DSP నాగేశ్వరావు తెలిపారు.
-ఇతరులకు ఇబ్బందులు కలిగించవద్దు.
-న్యూసెన్స్ క్రియేట్ చేయవద్దు.
- మద్యం తాగి వాహనాలు నడపవద్దు.
- ట్రిపుల్ రైడింగ్, బైక్ రైడింగ్స్ చేయవద్దు.
- పిల్లలకు వాహనాలు ఇవ్వవద్దు.
- జాతీయ రహదారిపై, ఫ్లై ఓవర్ పైకి రావద్దు.
- రాత్రి 1 గంటలవరకు మాత్రమే వేడుకలకు అనుమతి.*
- డ్రంకెన్ డ్రైవ్ నిర్వహిస్తాము.
- DJ, బాణసంచా నిషేధం.
- యువత జాగ్రత్తగా ఉండాలి అనీ DSP సూర్యాపేట సబ్-డివిజన్ వారు తెలిపారు