రిజర్వేషన్ ప్రకారం ఎస్సీలకు 8 వార్డులు కేటాయించాలీ. రిజర్వేషన్లు ఖచ్చితంగా అమలు చేయాలని డిమాండ్:-బ్యాగరి వెంకటస్వామి జిల్లా అధ్యక్షులు టి యంయం.


    చాటింపు ప్రతినిధి.  మహబూబ్నగర్  :తెలంగాణ మాలమహానాడు ఆధ్వర్యంలో ఈ రోజు మున్సిపల్ కమిషనర్ వడ్డె నరేందర్ గారిని కలిసి మహబూబ్ నగర్ మున్సిపాలిటీ ఏర్పడిన నాటి నుండి నేటి వరకు మాకు అనగా (ఎస్సీలకు) రాజకీయ రిజర్వేషన్లలో తీరని అన్యాయం చేస్తూనే ఉన్నారు. భారత రాజ్యాంగం మాకు కల్పించిన 15% రిజర్వేషన్ ను ఎప్పుడు కూడా అమలు చేయడం లేదు. అధికారులు గాని నాయకులు గాని, గత 5సం"ల ముందు జరిగిన ఎన్నికలలో మొత్తం 41 వార్డులు ఉండగా ఎస్సీలకు ఉన్న 15% రిజర్వేషన్ ప్రకారం 5 వార్డులు ఎస్సీలకు కేటాయించాలి, కానీ అప్పుడు కేవలం 3 వార్డులు (బోయపల్లి 34, ఎదుర 4, పాత పాలమూరు 13) మాత్రమే కేటాయించి ఎస్సీలకు తీరని అన్యాయం చేసి రాజ్యాంగానికి తూట్లు పొడిచారు.
     కావున ఈసారి జరిగే మున్సిపల్ ఎన్నికల్లో ఇప్పుడు కొత్తగా ఏర్పడిన వార్డులతో కలిపి 49 వార్డులు అవుతున్నాయి. కాబట్టి ఎస్సీలకున్న 15% రిజర్వేషన్ ప్రకారం 8 వార్డులు కేటాయించి మాకు న్యాయం చేసి, భారత రాజ్యాంగాన్ని గౌరవించాలని విజ్ఞప్తి చేస్తున్నాం.
     అలాగే మా ఎస్సీ జనాభా ఎక్కువగా ఉన్న పాత పాలమూరు 13వ వార్డు, మరియు బోయపల్లి 34వ వార్డులను ఇప్పుడున్న ఎస్సి రిజర్వేషన్ నుండి మారుస్తున్నారని ప్రచారం జరుగుతుంది. కావున ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎస్సీ జనాభా ఎక్కువగా ఉన్న ఈ రెండు వార్డులను ఎస్సి రిజర్వేషన్ నుండి మార్చకూడదని ఈ రెండు వార్డులను ఎప్పటికీ ఎస్సీలకే కేటాయించాలని విజ్ఞప్తి చేస్తున్నాం. కావున ఏది ఏమైనా ఎస్సీలకు 15% రిజర్వేషన్ అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నాం, కాదని మాకు అన్యాయం చేస్తే న్యాయ పోరాటానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తు వినతి పత్రం అందజేశారు.
*కమిషనర్ ను కలిసిన వారిలో- బ్యాగరి వెంకటస్వామి జిల్లా అధ్యక్షులు.* ఎడ్ల కృష్ణయ్య అధికార ప్రతినిధి. గాజ వెంకట్రాములు సహయ కార్యదర్శి. టంకర యాదగిరి ప్రచార కార్యదర్శి. మరియు చాంద్ పాషా తదితరులు ఉన్నారు.