తెలంగాణ పోలీస్ కానిస్టేబుల్ ట్రైనింగ్

*🔥తెలంగాణ పోలీస్ కానిస్టేబుల్ ట్రైనింగ్ పోయేవారికి ముఖ్యమైన విషయాలు🔥*


1) మీరూ సెలెక్ఠ్ అయిన జిల్లా హెడ్ క్వార్టర్ నుంచి వాహనంలో ట్రైనింగ్ సెంటర్ కి 16 జనవరి 2020 ఉదయం కల్లా వారే చేరవేస్తారు.


2) ట్రైనింగ్ సెంటర్ లో రిపోర్ట్ చేసేటపుడు 6,000 రూపాయిలు డిపాజిట్ చేయాల్సి ఉంటుంది(మెస్ ఛార్జీ రిఫండ్ చేస్తారు).


3) జనవరి 17వ తారీఖు నుంచి అసలు ట్రైనింగ్ మొదలు. ట్రైనింగ్ కి సంబంధించిన తదుపరి ప్రాసెస్ రూల్స్ శిక్షణ కేంద్రాలకు మెయిల్ చేయటం జరుగుతుంది. మీరు లోకల్ జిల్లా పేపర్స్, సంబంధిత పోలీస్ హెడ్ క్వార్టర్స్ నుంచి మీకు తదుపరి సమాచారం అందిస్తారు. 


4) ప్రస్తుతం కేవలం PC Civil/AR/Communication/Driver Mechanic వాళ్ళకే ట్రైనింగ్ అని ప్రకటించారు. ఇంకా మిగతావారివి అధికారికంగా తెలియాల్సి ఉంది. బెటాలియన్ వాళ్లకు ఐతే నిన్న గ్రౌండ్ రెడీ చేయండి అని ఆదేశాలు వచ్చాయంటా. 


5) ఆధార్ కార్డు,  10 ఫోటోలు, ప్లేటు, గ్లాసు, దిండు, బకెట్, మగ్, షూ పాలిష్ బ్రష్, రెండు ఖాకీ షార్టులు, భుజాల వరకు ఉండే రెండు తెల్ల బనీన్లు తీసుకెళ్లాలి. బెడ్ షీట్, కిట్ వాళ్లే ఇస్తారు. 


6) ట్రైనింగ్ లో సెలవుదినాలు 15. వరుసగా ఒక్కసారే 10 రోజులు మించి కుదరదు. ప్రభుత్వ సెలవదినాలు సపరేటు.


7) 7 రోజులు చెప్పకుండా పోతే షోకాజ్ నోటిసు ఇచ్చి చర్యలు తీసుకుంటారు.


8) మెడికల్ కారణాల వల్ల 30 రోజులు మించి హాజరు కాకపోతే తదుపరి వచ్చే నోటిఫికేషన్ వారితో పోవాలి. తదుపరి బ్యాచ్ తో కూడా మళ్ళీ చేజార్చుకుంటే ఇక అవకాశం ఇవ్వబడదు. 


9) పబ్లిక్ హాలిడే రోజు కూడా ట్రైనింగ్ ఉంటే అది పనిదినంగా పరిగణింపబడుతుంది.  


10)ఆరోగ్య భద్రత పథకం ట్రైనింగ్ మొదటిరోజు నుంచే వర్తిస్తుంది. చేరిన రోజే చెస్ట్ నెంబర్ స్కార్డ్ జీరో బ్యాలన్స్ బ్యాంక్ అకౌంట్ ఇవ్వబడును. 


11) ఖరీదైన వస్తువులు, బంగారం, ఖరీదైన మొబైల్ ఫోన్స్ లాంటివి తీసుకోని రాకూడదు.