భారతదేశ విద్యా వ్యవస్థలోనే పెను మార్పులకు కారకులు, దేశచరిత్ర లో నూతన అధ్యాయమునకు నాంది పలికిన మన మలుపు సృష్టికర్త, చీఫ్ మెంటర్, మన మార్గదర్శి మాన్య శ్రీ గౌ. DGP తెన్నేటి కృష్ణప్రసాద్ IPS అని మనలో ఎంత మంది మేదావుకు తెలుసు
భారతరాజ్యాంగం లోని ఆర్టికల్ 21A ద్వారా భారతదేశం లోని బాలబాలికలకు ఉచిత నిర్బంధ విద్య ను అమలు చేయించడం లో కీలక పాత్ర వహించి విద్యవేత్తల సమావేశాలలో భాగస్వాములై, భారత పార్లమెంట్ లో బిల్ పాస్ చేయించడం కీలక భాగస్వాములై విద్య హక్కు చట్టం (Right to Education Act) ప్రాథమిక విద్యా హక్కు 2009 లో సాధించి కలను సాకారం చేసుకొని భారతరాజ్యాంగం లోని ఆర్టికల్ 21A చట్టం ద్వారా భారతదేశం లోని బాలబాలికలకు ఉచిత నిర్బంధ విద్య ను భారతదేశం లోని అన్ని కుల, మతాలకు, అతీతంగా అన్నివర్గాల (ముఖ్యంగా అట్టడుగు వర్గాల) బాలబాలికలకు భవిష్యత్ తరాలకు బంగారు బాట వేయడానికి అహర్నిశలు కష్టపడి తాను రాసుకున్న పుస్తకం ఆధారం చేసుకొని (Traffiking in person -Tip of the Iceberg) దాన్ని అనుసంధానం చేసి (Right to Education Act) ప్రాథమిక విద్య హక్కుచట్టం ను సాధించడం లో సఫలీకృతులయ్యారు.ఈ చట్టం ద్వారా భారతదేశంలోని అన్ని కుల మతాలకు అతీతంగా బాలబాలికలకు ఉచిత నిర్బంద విద్య ద్వారా వారి జీవితాలకు వెలుగు నింప డానికి దోహదపడింది ఈ మలుపు. ఇది భారత చరిత్ర లో ఒక మైలురాయి. అంతటి ఘన విజయాన్ని ఛేదించిన మహోన్నతుడు, భవిష్యత్ తరానికి జ్యోతి రావు పూలే వారసుడు, విద్య నే మన ఆయుధం, విద్య తోనే అన్ని రంగాలలో విజయం సాదించవచ్చు అనే డా. బి ఆర్ అంబెడ్కర్ గారి ఆలోచన విధానాన్ని ఆచరిస్తూ తూచతప్పకుండ అమలు చేస్తూన్న మహానుభావుడు మన మాన్య DGP శ్రీ తెన్నేటి కృష్ణప్రసాద్ IPS అని ఎంత మంది BC, SC, ST, మైనారిటీ ప్రభుత్వ,/ప్రయివేట్ ఉపాధ్యాయులకు, విద్య వేత్తలకు, ఉన్నతమైన స్థాయి లో ఉన్న IAS, IPS, డాక్టర్స్, లాయర్స్,ప్రొఫెసర్స్, , శాస్త్రవేత్తలు, జర్నలిస్ట్ వివిధ సామజిక, సమాజ సేవకులకు కులసంఘాల నాయకులకు మరియు కార్యకర్తలకు, సమాజాన్ని ప్రభావితం చేసే కళాకారులకు ఎంత మందికి తెలుసు..??? కుల,మత,లింగ మరియు ప్రాంత భేదం లేకుండా భారతదేశ సమాజాన్ని ప్రభావితం చేసే ప్రతి పౌరుడు గర్వ పడేలా భారత రాజ్యాంగ లోని ఆర్టికల్ 21A Right to Education act 2009.ప్రాథమిక విద్యా హక్కు చట్టం ద్వారా బాలబాలికలకు ఉచిత నిర్బంధ విద్యా అమలు తీరు ను తెలంగాణ లో ఒక ఉద్యమం లాగా ముందుకు తీసుకువెళ్తారని ఆశిస్తూ.