సైక్లిస్ట్ గా రాణిస్తున్న  తనిష్క్

 


    హైదరాబాద్ డిసెంబర్29  చాటింపు ప్రతినిధి:         స్పోర్ట్స్  అథారిటీ ఆఫ్ ఇండియా ( SAI ) లో సైక్లిస్ట్ గా శిక్షణ పొందుతున్న  హైదరాబాద్ కు చెందిన M. తనిష్క్ ను అభినందించిన రాష్ట్ర అబ్కారీ, క్రీడా, పర్యాటక మరియు సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీ V. శ్రీనివాస్ గౌడ్ గారు. తనిష్క్ ఇప్పటికే జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో అతి చిన్న వయసులోనే సైక్లిస్ట్ గా రాణిస్తున్న  తనిష్క్ టోక్యో లో జరిగే 2020  ఒలంపిక్స్ లో మంచి ప్రతిభను కనబరచి పథకాలు సాధించి తెలంగాణ కు, మన దేశానికి మంచి పేరు తేవాలని మంత్రి శ్రీ V. శ్రీనివాస్ గౌడ్ గారు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ చైర్మన్ శ్రీ అల్లిపురం వెంకటేశ్వర రెడ్డి, గోపగోని శ్రీనివాస్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు.