నల్గొండ,డిసెంబర్ 30 చాటింపు ప్రతినిధి: లక్ష్యం నిర్ణయించుకొని ఆ దిశగా నిజాయితీ గా,నిబద్దత తో లక్ష్య సాధనకు కృషి చేయాలని ఇంఛార్జి కలెక్టర్ వి.చంద్ర శేఖర్ అన్నారు.సోమవారం ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల లో మహిళ,శిశు,దివ్యాంగుల, వయో వృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బాలికలు, మహిళలకు రక్షణ,భద్రత పై అవగాహన కలిగించేందుకు నిర్వహించిన ప్రేరణ అవగాహన సదస్సు లో చిన్న వయస్సు లోనే చదువు తో పాటు వివిధ రంగాల్లో ప్రతిభ కనబరుస్తున్న ప్రముఖ టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి,బాల మేధావి నైనా జైస్వాల్ నల్గొండ జిల్లా విచ్చేసి విద్యార్థులకు ప్రేరణ కలిగించేందుకు స్ఫూర్తిదాయక ఉపన్యాసం ఇచ్చి విద్యార్థులు,పెద్దలు,అధికారుల ప్రసంశలు అందుకొంది.జిల్లా యంత్రాంగం తరపున మహిళలు, బాలికల పై వివక్ష నిర్మూలనకు నిర్వహిస్తున్న కార్యక్రమాల్లో భాగంగా ఈ రోజు విద్యార్థులకు అవగాహన కలిగించేందుకు ఈ కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో నైనా జైస్వాల్,ఆమె తమ్ముడు అగస్త్య జైస్వాల్,తండ్రి అశ్వని కుమార్ తో విచ్చేసి తన అద్భుత ఉపన్యాసం తో బాలికలను ఉత్తేజ పరిచారు. ఇంఛార్జి జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ
నైనా బహు ముఖ ప్రజ్ఞా శాలి,15 సం.ల వయస్సు లో పి.జి.పూర్తి చేసిందని,రెండు చేతులతో రాయ గలుగుతుంది.ఇంకా జాతీయ,అంతర్జాతీయ స్థాయిలో టేబుల్ టెన్నిస్ లో ఎన్నో విజయాలు సాధించిందని,అంతే కాక మంచి వక్త అని తెలిపారు.జిల్లా యంత్రాంగం తరపున విద్యార్థులకు స్ఫూర్తి కలిగించేందుకు ఆహ్వానించి నట్లు తెలిపారు. బాలికల పట్ల కొనసాగుతున్న వివక్ష నిర్మూలనకు జిల్లా యంత్రాంగం కృషి చేస్తోందనీ ,
ఒక్కొక్క బాలిక తాము వగాహన చేసుకున్న విషయాలు వంద మంది కి చెప్పాల ని, వంద మంది కి స్ఫూర్తి కావాల ని అన్నారు..ప్రతి ఒక్కరూ నైనా కావాలి,మంచి ఆలోచన లతోనే మంచి లక్ష్యం వస్తుంది.అవసరం మేరకే మొబైల్ వాడాలి. కనుల ముందు లక్ష్యం కనపడాలి.మంచి
సమాజం నిర్మించాలి,కలిసి కృషి చేయాలని ఆయన సూచించారు.
ఎస్.పి. ఏ.వి.రంగ నాథ్ మాట్లాడుతూ
ఎన్ని కష్టాలు,కన్నీళ్లు ఎదురైనా చలించవద్దు,ఆఫ్ఘనిస్తాన్ లో చిన్న తనంలో మలాలా యూసూప్ జై అనే బాలిక తాలిబన్ తీవ్రవాదులను ఎదిరించి బాలల హక్కుల కోసం పోరాడి నోబెల్ ప్రైజ్ గెలుచుకుందనీ తెలిపారు.దేశం బాగుండాలి,మనం బాగుండాలి,మన ఆలోచన బాగుండాలి,మనమంతా ఒకటే బావన వుండాలి,నిబద్దత తో చదవాలి.చదువే ఆలోచన లో మార్పు తెస్తుంది. మలాల,నైనా జైస్వాల్ ను ప్రేరణ గా తీసుకోవాల ని ఆయన అన్నారు
నైనా జైస్వాల్ మాట్లాడుతూ విద్యార్థినులు ఆత్మ విశ్వాసం తో ముందుకు వెళ్లాలని,దైర్యం,సాహసం,తెగువ ఉండాలని అన్నారు.అమ్మ లాలన,నాన్న పాలన,గురువు బొదన మంచి వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి గా తీర్చి దిద్దుతుందని అన్నారు.నిరంతర అభ్యాసం ,గురువు కు గౌరవం ఇస్తూ జీవితంలో లక్ష్య సాధనలో విజయం సాధించాలని అన్నారు.లక్షలు సంపాదించేందుకు లక్ష మార్గాలు వున్నా,మంచి మార్గంలో వెళ్లాలంటే మంచి లక్షణాలు కలిగి ఉండాలని అన్నారు.స్త్రీ శక్తి లేని సమాజం లేదని అన్నారు.స్త్రీ అంటే కరుణ,దయ,ప్రేమ కు రూపమని, అవసర మైతే రుద్రమ దేవి,ఝాన్సి లక్ష్మి బాయి లాగా మారుతుందని అన్నారు.కష్ట పడి , ఇష్ట పడి లక్ష్యం సాధనకు కృషి చేయాలని అన్నారు.ఇల్లు బాగుం డా లంటే బాధ్యతగల తండ్రి వుండాలి,సమాజం బాగుండాలంటే బాధ్యత గల నాయకులు ఉండాలి,మనం బాగుండాలంటే మంచి స్నేహితులు ఉండాలని అన్నారు.ఆడ పిల్ల ప్రతి ఇంటికి వెన్నెల లాంటిది అమ్మను పూజించాలి,గౌరవించాలి, బార్యను ప్రేమించాలి,గురువుల ఆశీస్సు లు,వినయం వుండాలి అని ఉద్బోధించారు.నైనా జైస్వాల్ మాటలకు విద్యార్థినులు మంత్ర ముగ్ధుల్ని చేసింది.విద్యార్థినులు జిల్లా యంత్రాంగానికి,జిల్లా కలెక్టర్ కు కృతజ్ఞతలు తెలుపుతూ తమకు ప్రేరణ కలిగించిందని అన్నారు.ఈ సమావేశంలో జిల్లా విద్యా శాఖాధికారి బిక్ష పతి,అర్. డి.ఓ.జగదీశ్వర్ రెడ్డి,స్త్రీ,శిశు సంక్షేమ శాఖ పి. డి. సుభద్ర,డి.పి.అర్.ఓ.శ్రీనివాస్,జిల్లా వైద్య ఆరగ్యశాఖ అధికారి డా. కొండల్ రావు,జిల్లా క్రీడల అభివృద్ధి అధికారి మక్బూల్ అహ్మద్, మహిళా శక్తి కో అర్డి నేటర్ సునీత, బాలల సంరక్షణ అధికారి గణేష్ తదితరులు పాల్గొన్నారు