జర్నలిస్ట్ లకు అండగా అల్లం నారాయణ

విప్లవం కోసం పోరాడినట్లే... యూనియన్లు పోరాడాలని అనుకునే వాళ్లం. అలా పోరాడితేనే న్యాయం జరుగుతుంది అనుకునే వాళ్ళం. అనుక్షణం అనుసరించేందుకు పరితపించే వాళ్ళం. ప్రజల సంక్షేమం కోసం పాటుపడుదాం అనుకునేవాళ్ళం. నిజంగా చెప్పాలంటే... ఇవన్నీ చెప్పే మనం, వీటి గురించి విశాలంగా ఆలోచించే మనం పక్కన ఉన్న జర్నలిస్ట్ చనిపోతే చలించలేని స్థితిలో ఉండేవాళ్ళం. కుటుంబానికి అండగా ఉండేందుకు వెనుకడుగు వేసేవాళ్ళం. జర్నలిస్టుల జీవితాలను, జీతాలను పట్టించుకోని యాజమాన్యాలు ఒకవైపు అయితే, వారి జీవితాలకు భద్రత కల్పించే ప్రభుత్వాలు అసలే లేకుండే. నేటి పరిస్థితి అందుకు భిన్నంగా, జర్నలిస్ట్ లకు ఈ ప్రభుత్వం అండగా ఉందని, ధైర్యాన్ని ఇచ్చిందని చెప్పవచ్చు. మారు మూల మండల విలేకరి చనిపోతే కుటుంబం రోడ్డున పడకుండా తెలంగాణ ప్రెస్ అకాడమీ అండగా నిలబడింది. అల్లం నారాయణ సర్ కు జర్నలిస్టుల మీద ఉన్న ప్రేమ, ఆప్యాయత, వారి కష్టాల సారాంశమే. నేటి జర్నలిస్టులకు ప్రెస్ అకాడమీ దివిటిలా వెలుగు నియాల్సిన అవసరం. అలానే ముందుకు సాగుతుంది. దాని వెనుక పోరాటం ఉంది. త్యాగం ఉంది. అంతకు మించి ఆదర్శం ఉంది. ఇంకా చెప్పాలంటే ప్రతి తరానికి స్ఫూర్తి ఇచ్చే జర్నలిస్టులు తెలంగాణలో ఉన్నారు. షోయబ్ ఉల్లాఖాన్ అమరత్వం తెలంగాణ తొలి కలం సైన్యానికి ఆదర్శం అయితే. అల్లం నారాయణ, పాశం యాదగిరి, కె. శ్రీనివాస్, ఎన్. వేణుగోపాల్ వంటి వారి పోరాట బాటలో నడిచినవారు పిట్టల శ్రీశైలం, ఏంవి రమణ, క్రాంతి కుమార్, పల్లె రవి కుమార్, ఇస్మాయిల్, శైలేష్ రెడ్డి, మారుతి సాగర్, రాజేష్, యోగి లాంటి వారు ఎంతో మంది కొత్త తరం మాలాంటి జర్నలిస్టులకు ఆదర్శమయ్యారు. ఇలాంటి వారు ఇవాళ నాయకత్వంలో ఉన్నారు కాబట్టే మారుమూల గ్రామమైన తిరుమలగిరి లో చనిపోయిన ముగ్గురు జర్నలిస్ట్ కుటుంబాలకు చెక్కులు అందాయి. ఆ కుటుంబాలకు బాసటగా నిలబడ్డాం అనిపిస్తుంది. ఈ బృహత్తర కార్యక్రమాన్ని నడిపిస్తున్న అల్లం నారాయణ సర్ కు వందనాలు. చెక్కు తీసుకున్న కుంటుంబాల బాధను, వేదనను తీర్చలేం. కానీ ప్రెస్ అకాడమీ చేస్తున్న ఈ కృషికి, ఆ కుటుంబాల తరపున అల్లం నారాయణ సర్ కు కృతజ్ఞతలు. చివరగా కొత్తగా జర్నలిజంలోకి వస్తున్న, వచ్చిన యువతకు ప్రెస్ అకాడమీ  దిశా నిర్ధేశం చేయాలని కోరుకుంటూ....అందరికీ కృతజ్ఞతలు.