హైదరాబాద్ డిసెంబర్ 29 చాటింపు ప్రతినిధి: జాతీ య గిరిజన కమిషన్ చైర్మన్ గౌ . డా . నంద్ కుమార్ సాయి ఒక రోజు పర్యటన నిమిత్తం ఈ రోజు హైదరాబాద్ ను సందర్శించారు . నగరంలోని దిల్ ఖుశ అతిధి గృహములో ఏర్పాటు చేసిన కార్యక్రమములో వారు గిరిజనుల సమస్యలను విని సంబంధిత అధికారులతో చర్చించి వాటిని త్వరితగతిన పరిష్కరించే నిమిత్తం పలు సూచనలు ఆదేశాలు ఇచ్చారు . ఇందులో భాగంగా సింగరేణి కాలరీస్ కార్మికుల సమస్యల్లో ప్రధానంగా వారికి ఉద్యోగాలలో ప్రమోషన్ల విషయమై దామాషా ప్రకారం రిజర్వేషన్ లు వర్తింపచేయాలని, బ్యాక్ లాగ్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలనే అభ్యర్థనలు రాగా వాటిని పరిశీలించి అధికారులు నిబంధనల మేరకి వారికి తగు న్యాయం చేయాలనీ సూచించారు. సింగరేణి ప్రాజెక్ట్ లో భాగంగా నిర్వాసితులు అయిన గిరిజనులకు అనువయిన చోట భూములను, ఇళ్లను, నష్ట పరిహారాన్ని వెంటనే అందచేయాలని అధికారులను ఆదేశించారు.
వివిధ సంఘాలనుంచి అభ్యర్థనలను స్వీకరించి వాటిని వెంటనే పరిశీలంచి తగు చర్యలు తీసుకోవలసిందిగా అధికారులకు సూచించారు. గిరిజనులకు రాష్ట్రములో ప్రత్యేకంగా ST కమిషన్ ఏర్పాటుచేయాలని పలు సంఘాలు కోరగా డా . సాయి పరిశీలిస్తామన్నారు . మైదాన ప్రాంత గిరిజనుల అభివృద్ధి కార్యక్రమాలకై ప్రత్యేక itda లను ఏర్పాటుచేయాలని, st ఉపప్రణాళిక నిధులను సక్రమంగా వినియోగించాలని, కొత్తగా ఏర్పాటుచేసిన గిరిజన గ్రామ పంచాయతీలలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను నెలకొల్పాలని, గోండి, కోయ, లంబాడి వంటి గిరిజన భాషలను రాజ్యాంగ బద్ద భాషలుగా భారత ప్రభుత్వం గుర్తించాలని , గిరిజన యువతలో నిరుద్యోగ నిర్మూలనకై చిన్న తరహా పరిశ్రమల ఏర్పాటు నిమిత్తం నిధులు విడుదల చేయాలనీ పలు సంఘాలు అభ్యర్థించాయి. ఈ కార్యక్రమాన్ని Dr క్రిస్టినా జడ్ చోంగ్తు గిరిజన సంక్షేమ శాఖ కమీషనర్ సమన్వయ పరచగా శ్రీ అజయ్ మిశ్రా, ఇంధన శాఖ కార్యదర్శి , మరియు శ్రీ శ్రీధర్, సింగరేణి సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ వంటి పలువురు అధికారులు హాజరయినారు.
జాతీయ గిరిజన కమిషన్ చైర్మన్ హైదరాబాద్ సందర్శన