చాటింపు ప్రతినిధి:
ఇటీవల కాలంలో ఫ్రాడ్ లావాదేవీలు ఎక్కువైన నేపథ్యంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) ఒక అద్భుతమైన చర్యను చేపట్టింది.
జనవరి 1 నుండి దేశవ్యాప్తంగా SBI వినియోగదారులు ATM నుండి డబ్బులు విత్ డ్రా చేసుకోవాలంటే తప్పనిసరిగా తమ మొబైల్ నెంబర్ కి వచ్చే OTPని ఉపయోగించవలసి ఉంటుంది. *అయితే ఇది రాత్రి ఎనిమిది గంటల నుండి ఉదయం ఎనిమిది గంటల మధ్య జరిగే ATM విత్‌డ్రాయల్స్‌కి మాత్రమే వర్తిస్తుంది.* ఫ్రాడ్ లావాదేవీలు రాత్రి సమయంలో ఎక్కువ అవుతున్న అవుతున్న నేపథ్యంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ కొత్త విధానాన్ని ప్రవేశపెట్టింది. మీ బ్యాంక్ అకౌంట్ తో రిజిస్టర్ అయిన మొబైల్ నెంబర్ కి ఓటిపి పంపించబడుతుంది. పది వేల రూపాయల కంటే ఎక్కువ విలువ కలిగిన విత్‌డ్రాయల్స్ విషయంలో మాత్రమే ఓటిపి జనరేట్ చేయబడుతుంది. ఈ కొత్త విధానం అమలు పరచటానికి ఎలాంటి సాంకేతికపరమైన ఇబ్బందులు తలెత్తవని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హామీ ఇస్తోంది.