హైదరాబాద్ డిసెంబర్ 27 చాటింపు ప్రతినిధి: రాష్ట్ర అబ్కారీ, క్రీడా, పర్యాటక మరియు సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీ V. శ్రీనివాస్ గౌడ్ గారి అధ్యక్షతన నీరా ప్రాజెక్టు పై , గీత కార్మికుల సమస్యల పై, గుర్తింపు కార్డుల పంపిణీ, ఎక్స్ గ్రేషియా అమలు పై ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం బేగంపేట లోని టూరిజం ప్లాజా హోటల్ లో నిర్వహించారు.
గౌరవ ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు గీత కార్మికుల సంక్షేమం, అభివృద్ధి కోసం ప్రతిష్టాత్మకం నీరా పాలసీ ని ప్రకటించారని మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. సమీక్ష లో భాగంగా రాష్ట్రంలో నీరా మరియు అనుబంధ ఉత్పత్తుల తయారీకి సాంకేతికంగా అధ్యయనం వివరాలపై చర్చించినారు. రాజమండ్రి లోని వైఎస్సార్ హార్టికల్చర్ యూనివర్సిటీ లో నీరా అధ్యయన కమిటీ స్టడీ టూర్ లో అధ్యయనం చేసిన వివరాలను మంత్రి రాష్ట్ర గీత కార్మికుల సహకార ఫైనాన్స్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ ఆలోక్ కుమార్ గారిని అడిగి తెలుసుకున్నారు.
మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారు మాట్లాడుతూ రాష్ట్రంలో నీరా ఉత్పత్తి, నీరా సేకరణ, నిలువ చేయటం, అనుబంధ ఉత్పత్తుల తయారీ, స్టోర్ పాయింట్ ఏర్పాటు మరియు ప్యాకింగ్ కు సంబందించిన ప్రధాన అంశాల పై అధికారులకు దిశానిర్దేశం చేశారు.
ఈ సమీక్షలో నీరా ను రాష్ట్రంలో ప్రవేశ పెట్టేందుకు అవసరమైన ప్రణాళికలు రూపొందించాలని అధికారులను కోరారు. C M కేసీఆర్ గారు గీత వృత్తిదారుల సంక్షేమం, అభివృద్ధి, ఆత్మగౌరవం తో పాటు మంచి పోషక విలువలు కలిగిన సాంప్రదాయ పానీయం ను సామాన్య ప్రజల ఆరోగ్య0 కోసం రూపొందించిన నీరా , అనుబంధ ఉత్పత్తుల తయారిపై అధికారులతో చర్చించారు.
తెలంగాణ రాష్ట్రంలో తాడి మరియు అలైడ్ ప్రోడక్ట్స్ రీసెర్చ్ సెంటర్ ను హార్టికల్చర్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయటానికి అవసరమైన ప్రతిపాదనలు సిద్ధం చేయాలని మంత్రి అధికారులకు ఆదేశించారు. నీరా ను రాష్ట్రంలో వీలైనంత త్వరలో తీసుకరావటానికి ప్రణాళికలు రూపొందించి ఉత్పత్తి కేంద్రాలను గుర్తించి ప్రయోగాత్మకంగా ప్రారంభించాలని మంత్రి అధికారులను కోరారు.
సీఎం శ్రీ కేసీఆర్ గారి ఆదేశాల మేరకు హైదరాబాద్ లోని ట్యాంక్ బండ్ పరిసరాల్లో నీరా పార్లర్ ను KFC, ఫిజా హట్ స్టోర్ ల మాదిరిగా ఆధునికంగా రూపొందించి నీరా ను అందించాలన్నారు మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారు. నీరా పార్లర్ లను త్వరలోనే జిల్లా కేంద్రాలకు విస్తరించే విధంగా ప్రణాళికలను రూపొందించాలని మంత్రి అధికారులను ఆదేశించారు.
వీటితో పాటు గీత కార్మికుల సమస్యలపై చర్చించారు. తాటి , ఈత చెట్ల పరిరక్షణ, గుర్తింపు కార్డుల జారీ , ఎక్స్ గ్రేషియా అమలు తీరుపై ప్రధానంగా చర్చించారు. ఈ సమీక్షా సమావేశంలో MLC శ్రీ. బాలసాని లక్ష్మీ నారాయణ, MLA శ్రీ. ప్రకాష్ గౌడ్, శాసన మండలి మాజీ చైర్మన్ శ్రీ స్వామి గౌడ్, మాజీ M P డా. నర్సయ్య గౌడ్, ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ శ్రీ రాజేశం గౌడ్ లతో పాటు ప్రభుత్వ ఉన్నతాధికారులు Spl C S శ్రీ. సోమేష్ కుమార్, స్పోర్ట్స్ M D శ్రీ దినకర్ బాబు, అబ్కారీ శాఖ కమిషనర్ శ్రీ. సర్పరాజ్ అహ్మద్, టూరిజం MD శ్రీ మనోహర్, అబ్కారీ శాఖ అధికారులు శ్రీ అజయ్ రావు , శ్రీ హరికిషన్, దత్తరాజ్, చంద్రయ్య, రవీందర్ కుమార్, అరుణ్ కుమార్, లక్ష్మణ్ గౌడ్, రాష్ట్ర గీత వృత్తిదారుల సహకార సొసైటీ M D ఆలోక్ కుమార్ గార్లు తో పాటు అధికారులు పాల్గొన్నారు.