హైదరాబాద్ డిసెంబర్ 28 చాటింపు ప్రథినిది: నేపాల్ రాజధాని ఖాట్మండు లో డిసెంబర్ 1 నుండి 10 వరకు జరిగిన 13 వ సౌత్ ఆసియన్ గేమ్స్ లో తెలంగాణ రాష్ట్రానికి చెందిన సామ సాత్విక భారత దేశం తరుపున ప్రాతినిధ్యం వహించి లాన్ టెన్నిస్ విభాగంలో వివిధ కేటగిరి లలో రెండు బంగారు పతకాలు సాధించిన సందర్భంగా రాష్ట్ర అబ్కారీ, క్రీడా, పర్యాటక మరియు సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీ V. శ్రీనివాస్ గౌడ్ హైదరాబాద్ లో అభినందించారు. ఈ కార్యక్రమంలో ఆలంపూర్ శాసన సభ్యులు డా. అబ్రహం గారు, సాత్విక తండ్రి శ్రీ రవీందర్ గారు పాల్గొన్నారు.