సూర్యాపేట లోని పాత జాతీయ రహదారిపై నిలిచిపోయిన అభివృద్ధి పనులు.

      సూర్యాపేట     అభివృద్ధికి బాటలు వేయండి,


 లక్ష న్నర జనాభా సమస్యలు పరిష్కారానికి చేయూత నివ్వండి,


 పాత జాతీయ రహదారి నిర్మాణానికి తోడ్పాటు నివ్వండి,


 వ్యాపారాల అభివృద్ధికి సహకరించండి.... 


జిల్లా కేంద్రానికి గుండె కాయ లాంటి పాత జాతీయ రహదారి విస్తరణ జరిగి దాదాపుగా అయిదు నెలలు గడుస్తుంది. 270 మంది షాపు, నివాస దారులు ఈ రహదారికి ఇరువైపుల ఉన్నారు. కాగా అభివృద్ధిలో భాగంగా మంత్రి జగదీష్ రెడ్డి సూచన మేరకు దాదాపుగా 265 మంది సహకరిస్తూ 80 ఫీట్ల రోడ్డు విస్తరణకు సహకరించారు. పనులు ప్రారంభం అయిన తర్వాత కొంతమంది కోర్టుకు వెళ్లడంతో ప్రస్తుతానికి పనులు నత్తనడకన సాగుతున్నాయి. దీంతో పట్టణ జనాభా తో పాటు పట్టణానికి వచ్చి పోయే వారితో దాదాపు లక్ష న్నర మంది ప్రజలు ఈ రహదారిపై నరకయాతన పడుతున్నారు. అదేవిధంగా వాహనదారులు, పాదచారులు ఈ రహదారిపై రాకపోకల విషయంలో ఇబ్బందులకు గురవుతున్నారు. పట్టణానికి వచ్చిన వారి తో పాటు పట్టణాల్లో నివసిస్తున్న వారిలో  ప్రతి ఒక్కరూ ఈ పాత జాతీయ రహదారిని టచ్ చేయాల్సి ఉంటుంది. కాగా కోర్టు కేసు నేపద్యంలో పనులు నిలిచిపోవడంతో రహదారి అడవి ని తలపిస్తోంది. మంత్రి జగదీష్ రెడ్డి  25 కోట్లతో ఈ రహదారిని సుందరీకరణ చేసేందుకు నిధులు తెచ్చి పనులు ప్రారంభించారు. బాధితులకు తొలివిడత లోనే కేసారం వద్ద నిర్మాణం అవుతున్న డబల్ బెడ్ రూమ్ లో ఇండ్లు, పాత వ్యవసాయ మార్కెట్ యార్డులో నిర్మాణమవుతున్న మోడ్రన్ మార్కెట్లో షాపులు మంత్రి ఇవ్వనున్నారు.... ఈ నేపథ్యంలో రహదారి పనులు ముగిస్తే పట్టణానికి వన్నె తెచ్చే విధంగా సుందరీకరణ జరిగే అవకాశం ఉంది .కోర్టు నేపథ్యంలో పనులు నిలిచిపోవడంతో లక్ష యాబై మంది జనాభా తో పాటు ఈ రహదారిపై ఇరువైపులా ఉన్న 240మంది  గృహ ల బాధితులు కూడా ఇబ్బందులు పడుతున్నారు. కోర్టు కేసు తో వారు ఇరువైపులా కూల్చివేయబడిన షాపులు, నివాసాల స్థానంలో నూతన నిర్మాణాలు చేపట్టలేక వ్యాపారాలు చేసుకోలేక ఆ మొండి గోడల మధ్యనే కాలం గడుపుతున్నారు. ఈ క్రమంలో జాతీయ రహదారి రోడ్డు మాస్టర్ ప్రకారం విస్తరణ జరిగిన పాత జాతీయ రహదారి 50 మీటర్లు కలదు.50 మీటర్లు(165 ఫీట్లు) వరకు ఉన్న నిర్మాణాలు ఆక్రమణ లు అని అధికారులు  నోటీసు ఇవ్వడం తెలిసిందే. ఈ నేపథ్యంలో మానవతా దృక్పథంతో అధికారులు 165 ఫీట్లు కాకుండా  80 ఫీట్ల ను మాత్రమే చట్ట ప్రకారం తీసుకోవడం తెలిసిందే. ఈ నేపథ్యంలో బాధితులు ఇష్టపూర్తిగా ఆమోదం తెలపడంతో అధికారులు 80 ఫీట్ లకు రోడ్డు విస్తరణ చేయడం విదితమే. కాగా సెప్టెంబర్ మాసంలో బాధితులో కొంతమంది కోర్ట్ కి  వెళ్ళగా...  నష్ట పరిహారం, హక్కుల విషయంలో లోయర్ కోర్ట్ లో తేల్చుకొని పరిహారం పొంద వలసిందిగా  కోర్టు చెప్పినది.కానీ దానిని మిస్ గైడ్ చేస్తూ వేరే కోర్టులో కేసు వేసి స్టే తెచ్చుకోవడంతో అభివృద్ధికి బ్రేక్ పడింది. కేవలం 30 ,40 మంది కోసం లక్ష న్నర జనాభా ఇబ్బందులు పడే పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో కోర్టుకెళ్లిన బాధితులపై పట్టణ ప్రజలు, పాదచారులు, వాహనదారులు మండిపడుతున్నారు. ప్రతిరోజు ఈ రహదారి పై ప్రయాణం నరకాన్ని తలపిస్తుంది. వాస్తవాలు తెలుసుకొని అభివృద్ధికి సహకరించాలని పట్టణ ప్రజలు ముక్తకంఠంతో కోర్టుకెళ్లిన వారికి విజ్ఞప్తి చేస్తున్నారు.ఇప్పటికైనా కోర్టుకెళ్లిన వారు అందరి బాధలను మనుగడలోకి తీసుకొని కోర్టులో వేసిన కేసు ఉపసంహరించుకోవాలని పలువురు విజ్ఞప్తి చేస్తున్నారు.