సూర్యగ్రహణం దానికి గల కారణం: చెకి ముకి జన విజ్ఞాన వేదిక

*సూర్యగ్రహణం దానికి గల కారణం*


*సూర్యగ్రహణ సమయం*
ఉదయం: 8:09నుండి 11:11 వరకు
*ఎం జరుగును*
మెల్లి మెల్లిగా చీకటి పడుతుంది.తర్వాత కొన్ని నిమిషాలు సూర్యుడు కనపడడు ఆ తర్వాత మెల్లి మెల్లి గా సూర్యుడు పూర్తి గా కనబడుతాడు.
*ఎలా చూడాలి*
సూర్యగ్రహనానికి మాత్రం సన్ గ్లాస్సెస్ పెట్టుకొని చూడొచ్చు.లేదా ఒక ఆద్దానికి ఇరువైపులా మసి పూసి చూడొచ్చు.
*ఎవరు చూడచ్చు*
●అన్ని పనులు చేసుకుంటు చూడొచ్చు.
●ప్రెగ్నెన్సీ ఉన్నవారు కూడా ధైర్యంగా తిరుగొచ్చు..
●అన్ని రాసులవారు ఆనందంగా చూడొచ్చు.
●చిన్న పిల్లలు గంతులేస్తూ మరి చూడొచ్చు.
●మధ్య వయస్సు వాళ్ళు మరి మరీ చూడొచ్చు
●ముసలి వాళ్లు ముసి ముసి నవ్వులతో  చూడొచ్చు
●అందరూ అన్నం తింటు,నీళ్లు త్రాగుతూ తనివి తీరా చూడొచ్చు
*రాహువు కేతువులు*
●రాహువు కేతువులు జ్యోతిష్య పండితులకు పరిమితం.రాహువు కేతువులు సూర్యుణ్ణి మింగుతాయి,లేదా సుర్యునికి అడ్డంగా వస్తాయి అనేది అమాయకత్వంలో ఉన్న మూర్ఖత్వం.
●రాహుకేతువులు,రాశులు, అంటూ మూఢనమ్మకను జొప్పించి వ్యాపారం చేస్తూ... అమాయకులను బయ బ్రాంతులకు గురి చేయొద్దు.


*అసలు కారణం*
అసలు జరిగేది ఏంటంటే...
సుర్యునికి భూమికి మధ్యలో చంద్రుడు రావడం వల్ల ఈ సూర్య గ్రహణం ఏర్పడుతుంది.
అనేది వాస్తవం.దీనిని సైన్స్ బల్ల గుద్ది చెబుతుంది
అన్ని దేశాలు ఆమోదించాయి కూడా.
*విశ్వరహాస్యం*
ఇది విశ్వవిచిత్రం ప్రతీ ఒక్కరు చూడండి తరించండి..ఇలాంటి అవకాశం మళ్ళీ చాలా సంవత్సరాలు గడిస్తే కానీ రాదు..మన దేశంలో ఈ సూర్య గ్రహణం కనపడడం మన అదృష్టం.
*చెకి ముకి జన విజ్ఞాన వేదిక*