గురుకులాలు సీఎం కేసిఆర్ గారి మానస పుత్రికలు:స్త్రీ- శిశు సంక్షేమ శాఖ మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్

               తెలంగాణ ట్రైబల్ రెసిడెన్షియల్ టీచర్స్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ అసోసియేషన్ (ట్రైటా) డైరీ -2020 విడుదల సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో *ముఖ్య అతిథిగా రాష్ట్ర గిరిజన సంక్షేమ, స్త్రీ- శిశు సంక్షేమ శాఖ మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్  ఎస్సీ, ఎస్టీ గురుకులాలు కార్యదర్శి ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్, జాయింట్ సెక్రటరీ నవీన నికోలస్, ఇతర అధికారులు, స్థానిక నేతలు.


*సమావేశంలో మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్  కామెంట్స్...*


మన శాఖలో అధికారులు, టీచర్లు, స్టూడెంట్లు ఒక  ఉమ్మడి కుటుంబం గా ఉన్నాం.


*మనమీద ఎంతో నమ్మకంతో తమ పిల్లల్ని తల్లితండ్రులు ఇక్కడకు పంపారు. కాబట్టి వారిని మన పిల్లల కంటే ఎక్కువగా చూసుకోవాలి.*


మీ(టీచర్ల) ఇబ్బందుల్ని పరిష్కరించే బాధ్యత నాది.


తెలంగాణ గురుకులాలు స్వర్గీయ ఎన్టీఆర్ వీటిని తీసుకొచ్చారు. కానీ తెలంగాణ వచ్చిన తర్వాత సీఎం కేసిఆర్   బాగా బలోపేతం చేశారు. డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ 125వ జయంతి రోజున ఒకేసారి 125 గురుకులాలు ఇచ్చిన గొప్ప మనసున్న నాయకులు గిరిజనులు అభివృద్ధి కావాలంటే ఇంకా ఏమి చేయాలని ఆయన ఆలోచించినప్పుడు చాలా మంది గిరిజన బాలికలు ఇంటర్ తర్వాత వసతి గృహ సదుపాయాలు లేక చాలామంది డిగ్రీ చదవడం లేదని, మధ్యలోనే వారి విద్య ఆగిపోతుందని ఆయన దృష్టికి వచ్చిన వెంటనే ఒకేసారి 22 డిగ్రీ గిరిజన మహిళా గురుకుల విద్యాలయాలు మంజూరు చేశారు.*కేవలం గురుకులాలు మంజూరు చేయడమే కాకుండా వాటికి ఉపాధ్యాయులు, సిబ్బంది, వసతులు కూడా కల్పించారు.గతంలో గురుకులాలు ఇస్తే సిబ్బంది, వసతులు ఉండేవి కావు.దేశంలో ఎక్కడా లేనివిధంగా మన గురుకులాల్లో నాణ్యమైన విద్యను అందించడమే కాకుండా విద్యార్థులకు అవసరమైన పౌష్టికాహారాన్ని కూడా ఇస్తున్నారు.ఇన్ని వసతులు కల్పించి మన బిడ్డల కోసం ఆరాట పడుతున్న సీఎం కేసిఆర్  ఆలోచన మేరకు మనం కూడా బాగా పనిచేసి గిరిజన గురుకులాల ను దేశంలో నంబర్ వన్ గా చేయాలి.తల్లితండ్రులు, కుటుంబాన్ని వదిలి ఇక్కడకు చదువుకోవడానికి వచ్చిన వీరికి గొప్ప భవిష్యత్ అందించాలి.