మున్సిపల్ ఎన్నికలకు సిద్ధంగా ఉన్నాం: మంత్రి గంగుల  

మంత్రి గంగుల 


* మున్సిపల్ ఎన్నికలకు సిద్ధంగా ఉన్నాం


* ఎన్ని ప్రయత్నాలు చేసినా మాకు తప్ప ఏ పార్టీకి విజయావకాశాలు లేవు


* అభివద్ధి చేసే పార్టీ చేసే టీఆర్ఎస్ .. ఆటంకాలు కల్గించే పార్టీ బీజేపీ


* వందల కోట్లతో కరీంనగర్ లో అభివృద్ధి పనులు జరుగుతున్నాయి.


* బీజేపీ నేతలు మాత్రం అవకతవకలు జరిగాయంటూ ఫిర్యాదులు చేసి, పోలీసు కేసులు పెడుతున్నారు. 


*  గతంలో మోడీ, అమిత్ షాకు కూడా ఫిర్యాదులు చేసారు.


 * ఈ సారి ఒక్క బీజేపీ కార్పోరేటర్ ను గెలిపించినా ఇక్కడ పనులన్నీ ఆపుతారు. ఐటీ టవర్ ఓపెన్ కాకుండా ఆపుతారు.


* అభివృద్ధి నిరోధకులను ఓడించండి.


* స్థానిక సంస్థల్లో అభివృద్ధి కావాలంటే రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీఆర్ఎస్ నే గెలిపించండి.


*  గ్రానైట్ విషయంలో బీజేపీ నేతలు అనవసర రాద్ధాంతం చేసి ఫేయిలయ్యారు.


*  ఆర్టీసీ డ్రైవర్ బాబు మృతిని కూడా రాజకీయం చేసారు. 


* కరీంనగర్ ఐటీ టవర్ లో తమ శాఖల ఏర్పాటుకు 18 కంపెనీలు ముందుకు వచ్చాయి. 


* 30న జరగాల్సిన ఐటీ టవర్ ప్రారంభోత్సవం ఎన్నికల కోడ్ వల్ల వాయిదా పడింది. అయినా కంపెనీలకు కావాల్సిన సదుపాయాల కల్పన, ఇతర ప్రాసెస్ పనులు కొనసాగుతాయి.


* నగరంలో స్మార్ట్ సిటీ పనులు శరవేగంగా సాగుతున్నాయి.


* మున్సిపల్ కమిషనర్ పై పోలీసు కేసులు పెట్టి బీజేపీ నేతలు భయభ్రాంతులకు గురిచేసినా అభివృద్ది ఆగదు.


* 27న మున్సిపల్ ఎన్నికల శంఖారావం  పూరిస్తున్నాం


* త్రీమెన్ కమిటీ ద్వారా పోటీ చేసే అభ్యర్థులను ఎంపిక చేస్తాం.


* పార్టీ వ్యతిరేకులకు టికెట్లు ఇవ్వొద్దని త్రీమెన్ కమిటీకి సూచిస్తాం. 


* ప్రజలు కోరుకునే నీతివంతమైన పాలన అందిస్తాం. ఆశీర్వదించండి.


*   పార్టీకి విధేయత, విజయావకాశాలు ఉన్న వారికే మున్సిపల్ టికెట్లు ఇస్తాం.


* స్మార్ట్ సిటీ టెండర్లలో ఎలాంటి అక్రమాలు లేవు. బీజేపీ చేస్తున్నవన్నీ తప్పుడు ఆరోపణలు


* కరీంనగర్ లోని 60 డివిజన్లలో టీఆర్ఎస్ ఒంటరిగా పోటీ చేస్తుంది.


మున్సిపల్‌ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ జెండా ఎగురవేస్తామని మంత్రి గంగుల కమలాకర్‌ అన్నారు. కరీంనగర్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 'టీఆర్‌ఎస్‌ పార్టీ అభివృద్ధి చేస్తుంటే బీజేపీ అడ్డుపడుతోంది. ఇప్పటి వరకు అభివృద్ధిని అడ్డుకోవడానికి 16లేఖలు ఇచ్చింది. కరీంనగర్‌లో స్మార్ట్‌సిటీ పనులు వేగంగా జరుగుతున్నాయి. అభివృద్ధి నిరోధకులను ఓడించాలి. టీఆర్‌ఎస్‌ పార్టీతోనే అభివృద్ధి సాధ్యమని ప్రజలు గ్రహించాలి. ఇప్పటి వరకు 50శాతం పనులు మాత్రమే జరిగాయి. మిగిలిన 50శాతం పనులకు నిధులు సిద్ధంగా ఉన్నాయి. ఐటీటవర్‌లో తమ శాఖల ఏర్పాటుకు 18 కంపెనీలు ముందుకొచ్చాయి. ఇది కరీంనగర్‌ యువతకు సువర్ణావకాశం. భవిష్యత్‌లో కరీంనగర్‌ ఐటీహబ్‌గా మారుతుంది. మరో ఐటీ టవర్‌ నిర్మాణానికి కూడా ప్రణాళికలు రూపొందించాం. ఈనెల 27న మున్సిపల్‌ ఎన్నికల శంఖారావం మోగించనున్నాం. ఒక్కో డివిజన్‌కు ఐదుగురు సభ్యులతో కమిటీని ఏర్పాటు చేస్తున్నాం. ఈ కమిటీ డివిజన్లలో పర్యటించి, పరిశీలించి సభ్యులను ఎంపిక చేస్తుందని' మంత్రి వివరించారు.