అర్జీలను త్వరితగతిన పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ సి. హరికిరణ్
చాటింపు   ప్రతినిది:   కడప, డిసెంబర్ - 30: - అధికారులు స్పందన అర్జీలను త్వరితగతిన పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ సి. హరికిరణ్ పేర్కొన్నారు.సోమవారం కలెక్టరేట్లోని స్పందన హాల్లో స్పందన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ సి.హరికిరణ్ మాట్లాడుతూ ప్రజలు తమసమస్యల పరిష్కారం కోసం జిల్లానలుమూల నుంచి స్పందన కార్యక్రమానికి వస్తుంటారని అధికారులు వారి సమస్యలను గుర్తించి పరిష్కరించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. అనంతరం ప్రజల నుంచి వచ్చిన అర్జీలను స్వీకరించి సంబంధిత అధికారులకు ఎండార్స్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు.  మైలవరం మండలం వేపరాల గ్రామానికి చెందిన జి.తిరుపతమ్మ తనకు నేతన్ననేస్తం పథకం వర్తింపచేయాలని వినతి పత్రం సమర్పించారు. పెండ్లిమర్రి మండలం పాతసంగటి పల్లెకు చెందిన ఆర్. లక్ష్మీదేవి వైయస్సార్ రైతు భరోసా డబ్బులు తమ ఖాతాకు జమకాలేదని వినతి పత్రం సమర్పించారు.  చింతకొమ్మదిన్నె మండలం మామిళ్ళపల్లి కు చెందిన ఎం. అరుణ తనకు రేషన్ కార్డు మంజూరు చేయాలని వినతి పత్రం సమర్పించారు.  కడప మండలం చిన్నచౌకు కు చెందిన పి. సుధాకర్ తనకు వికలాంగుల పెన్షన్ మంజూరు చేయాలని వినతి పత్రం సమర్పించారు. రైల్వేకోడూరు మండలం ఎస్సీ కాలనీకి చెందిన కె. చెంగయ్య తనకు ఇంటి స్థలం మంజూరు చేయాలని వినతి పత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ గౌతమి, ట్రైనీ కలెక్టర్ శ్రీవాస్ నుపూర్, జాయింట్ కలెక్టర్ 2 శివారెడ్డి, డిఆర్ఓ రఘునాథ్, స్పెషల్ కలెక్టర్ సతీష్ చంద్ర, ఎఫ్ ఎస్ ఓ రామచంద్రారెడ్డి, ఐసిడిఎస్ పిడి పద్మజ, ల్యాండ్ అండ్ సర్వే ఏడి ప్రసాద్ రావు, ఏవో గంగయ్య, ఇతర జిల్లా అధికారులు పాల్గొన్నారు.