జాతి జర్నలిస్టులకు ఎంజెఎఫ్ అండ..
జాతి జర్నలిస్టులకు మాదిగ జర్నలిస్టుల ఫోరం తన శక్తి మేరకు అండగా నిలబడేందుకు ప్రయత్నిస్తుంది. ఈ ఏప్రిల్ మాసంలో రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన విజయ్ కుటుంబాన్ని ఆదుకునేందుకు తన శక్తి మేరకు కృషి చేసింది. విజయ్ చనిపోయిన తర్వాత స్థానిక ముషీరాబాద్ జర్నలిస్టుల సహకారంతో ఐదు లక్షల రూపాయలు సేకరించి బ్యాంకులో ఫిక్స్ డ్ డిపాజిట్ చేయడం జరిగింది. గురుకులాల సంస్థ కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సహకారంతో విజయ్ కుమారుడిని గురుకుల పాఠశాల వసతి గృహంలో చేర్పించినప్పటికి ... ఆ బాబు ఉండకపోవడంతో తీసుకువచ్చి మళ్ళీ స్థానిక పాఠశాలలో చేర్పించడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం అందచేసే ఒక లక్ష రూపాయల ఆర్ధిక సహాయం కోసం చాటింపు అశోక్ అన్నా, ఇరుగు చంద్రశేఖర్ అన్నా, మాతంగి దాస్ అన్నాల సహకారంతో సమాచార శాఖకు దరఖాస్తు చేయగా... చెక్కు మంజూరైంది. ఈ నెల 27న విజయ్ కుటుంబ సభ్యులకు అధికారులు, ప్రెస్ అకాడెమీ అందచేస్తుంది. సమాచార భవన్ లో ఉదయం 10 గంటలకు ఈ చెక్కు అందచేస్తారు. అందుబాటులో ఉన్న జాతి మిత్రులు ఈ కార్యక్రమానికి హాజరు కావాలని మనవి. ఈ రకంగా ఎంజెఎఫ్ విజయ్ కుటుంబానికి అండగా నిలబడేందుకు శక్తి మేరకు పని చేసింది. ఇదే ఐక్యత భవిష్యత్ లో కూడ ఉండాలని ... ఆకాంక్షిస్తూ జై మాదిగ... జై భీమ్...
-మాదిగ జర్నలిస్టుల ఫోరం,
తెలంగాణ రాష్ట్రం.