రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన సీనియర్ జర్నలిస్ట్ విజయ్ కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం ఆర్థిక సహాయం అందజేసింది. శుక్రవారం మాసబ్ ట్యాంక్ లోని సమాచార భవన్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రాష్ట్ర మీడియా అకాడెమీ చైర్మన్ అల్లం నారాయణ విజయ్ సతీమణి సుమలతకు ఒక లక్ష రూపాయల చెక్కును అందచేశారు. ఈ సందర్భంగా అల్లం నారాయణ మాట్లాడుతూ జర్నలిస్టుల ఆకస్మిక మరణాలు తమను తీవ్రంగా కలచి వేస్తుందని విచారం వ్యక్తం చేశారు. చనిపోయిన జర్నలిస్టుల కుటుంబాలకు ఆర్థికంగా ఆదుకునేందుకు మీడియా అకాడమీ నిర్మాణాత్మకo గా ముందుకు సాగుతోందని తెలిపారు. జర్నలిస్టులను అన్నీ విధాల ఆదుకునేందుకు కసరత్తు చేస్తోందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్ జిల్లా జర్నలిస్ట్ యూనియన్ అధ్యక్షుడు ఇరుగు చంద్రశేఖర్, చాటింపు సంపాదకులు యాతాకుల అశోక్, హెచ్ యు జె నాయకురాలు నాగవాణి, భుజెందర్, కె.రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
జర్నలిస్ట్ విజయ్ కుటుంబానికి ప్రభుత్వ ఆర్థిక సహాయం