* రిజర్వేషన్ అమలుపై ప్రత్యేక దృష్టి పెట్టాలి
* స్వేచ్చాయుత వాతావరణంలో ఓటింగ్ జరగాలి
* "పెద్ద బిడికి" బైఫరిగేషన్ అంశాన్ని కమీషనర్ దృష్టికి తెచ్చిన జేసీ గౌతమి
కడప, డిసెంబర్ 27: రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటర్లందరూ స్వేచ్చాయుత వాతావరణంలో ఓటు హక్కును వినియోగించుకునేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి డా.ఎన్. రమేష్ కుమార్ అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలకు సూచించారు. శుక్రవారం స్థానిక సంస్థల ఎన్నికలకు సంబందించి అమరావతి నుండి పంచాయతీ రాజ్ కమిషనర్ గిరిజా శంకర్ పంచాయతీరాజ్ శాఖ ప్రధాన కార్యదర్శి గోపాల కృష్ణ ద్వివేదిలతో కలిసి ఆయన అన్ని జిల్లాల కలెక్టర్లు ఎస్పీలు జడ్పీ సీఈవోలతో వీడియో కాన్ఫరెన్స్ ను . ఈ సందర్బంగా ప్రధాన ఎన్నికల అధికారి రమేశ్ కుమార్ మాట్లాడుతూ... ఎన్నికలు స్వేచ్చాయుత వాతావరణంలో నిర్వహించేందుకు అధికారులు అన్ని చర్యలను చేపట్టాలన్నారు. ఎన్నికల విధుల్లో పాల్గొనే అధికారులు సొంత మండలాల వారయితే.. వారికి. ప్రధాన భాద్యతలు అప్పగించకుండా చూడాలని ఆయన జిల్లాల అధికారులకు సూచించారు. ఈ సంధర్భంగా ఎన్నికల అధికారి మాట్లాడుతూ ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలన్నారు. ఎంపీటీసీ, జెడ్పిటిసి ఎన్నికలలో రిటర్నింగ్ ఆఫీసర్ ని జాయింట్ కలెక్టర్ లేదా జెడ్పి సీఈవోనే నియమించుకోవాలి అన్నారు. ఎవరైతే సీనియర్ అధికారో వారిని మాత్రమే రిటర్నింగ్ ఆఫీసర్ గా నియమించాలన్నారు. ఎంపీపీ, ఎంపీటీసీ ఎన్నికలకు స్పెషల్ ఆఫీసర్ గా ఎవరైతే పని చేస్తున్నారో వారిని ఎన్నికల రిటర్నింగ్ అధికారిగా నియమించాలన్నారు. ఏవైనా సమస్యాత్మక గ్రామాలు ఉంటే ఇప్పుడే గుర్తించాలని, నేర చరితం కల్గిన వ్యక్తులు ఉంటే.. ముందస్తుగా వారిపట్ల తగు చర్యలు తీసుకోవాలని అన్నారు. అదే విధంగా ఒక్కో విడత ఎన్నికలకు నాలుగు రోజుల వ్యవధి ఉండేటట్లు చూసుకోవాలన్నారు. ఎన్నికల ప్రక్రియలో పాల్గొనే అధికారులు వారి సొంత మండలాల్లో కాకుండా వేరే మండలాలకు పంపాలని సూచించారు. 

నోటిఫికేషన్ వచ్చిన రోజు నుంచి నామినేషన్ కౌంటింగ్ తదితర వాటిపై పోలీస్ ప్రత్యేక బందోబస్తు, అవసరమైతే సెంట్రల్ ఫోర్స్ ఏర్పాటు చేయాలన్నారు. బ్యాలెట్ బాక్సులు ఎంత అవసరమో.. జిల్లాల వారీగా రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి కలెక్టర్ల ద్వారా వివరాలు అడిగి తెలుసుకున్నారు. బ్యాలెట్ బాక్సులు రిపేరులో ఉంటే వెంటనే మరమ్మతులు చేయించాలన్నారు. పోలింగ్ కేంద్రాల మౌలిక సదుపాయాలను పరిశీలించాలన్నారు. ఏవైనా మౌలిక సదుపాయాలు లేకపోతే వెంటనే కల్పించేందుకు అన్ని రకాల చర్యలు చేపట్టాలన్నారు. రాబోయే ఎన్నికలలో సచివాలయ ఉద్యోగులు సైతం ఎన్నికల నిర్వహణ విధులకు సిద్ధం కావాలన్నారు. అదేవిధంగా ప్రింటింగ్ బ్యాలెట్ ప్రపోజల్ పెట్టి రేటు ఫిక్స్ చేయాలన్నారు. ఎక్కడైనా సమస్యాత్మకంగా పోలింగ్ కేంద్రాలు ఉంటే ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారం ప్రధానంగా ఎస్సీ , ఎస్టీ, బిసి, ఉమెన్ రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాటించేటప్పుడు జాగ్రత్తగా ప్రణాళికలు తయారు చేయాలన్నారు. పోలింగ్ స్టేషన్లో వసతులు, మెటీరియల్స్, బ్యాలెట్ పేపర్లు, బాక్సులు సిద్ధంగా ఉంచుకోవాలన్నారు. లోకల్ పరిస్థితుల బట్టి ఎక్కడ ఎటువంటి సమస్య లేకుండా ఎన్నికలు జరిగేందుకు ఇప్పటినుంచి చర్యలు చేపట్టాలన్నారు. వెబ్ కాస్టింగ్ ను లోకల్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ తో పని చేయించుకోవాలి అన్నారు. ప్రత్యేకంగా ల్యాప్టాప్, ట్రైనింగ్ ఇచ్చి మానిటరింగ్ కంట్రోల్ ఏర్పాటు చేసుకోవాలన్నారు.
ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైన నాటి నుండి.. గత శాసన సభ ఎన్నికల సమయంలో లాగానే మోడల్ కోడ్ అమలు చేయాలని సూచించారు. ఈ సందర్భంగా
స్థానిక కలెక్టరేట్ ఎన్ఐసి వీడియో కాన్ఫరెన్స్ హాలు నుండి జిల్లా జాయింట్ కలెక్టర్ ఎం.గౌతమి మాట్లాడుతూ.. ఎన్నికల కమీషన్ నిబంధనల మేరకు ఎన్నికల నిర్వహణ పనులను విధిగా చేపడుతున్నామన్నారు. నిర్ణీత గడువులోపు ఎన్నికల ప్రక్రియలను పూర్తి చేస్థామన్నారు. జిల్లాలోని సంబేపల్లి మండల పరిధిలోని పెద్ద బిడికిలో వంద శాతం గిరిజన ఓటర్లే ఉన్నారని, పోలింగ్ కోసం వారు బైఫరిగేషన్ కోరుతున్నారని, ఈ విషయాన్ని కమిషనర్ దృష్టికి తెస్తున్నామన్నారు. ఇప్పటికే జిల్లాలో ఎన్నికల్లో రిజర్వేషన్ల ప్రక్రియ గురించి సమావేశాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో జాయింట్ కలెక్టర్ తో పాటు జేసీ-2 శివారెడ్డి, జిల్లా ఎస్పీ అన్బు రాజన్, జెడ్పి సీఈవో సుధాకర్, డిపిఓ ప్రభాకర్ రెడ్డి ,ఇతర పోలీస్, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు.